Tuesday, September 17, 2024

యజ్ఞముతోనే ప్రజలను సృష్టించిన పరమాత్మ!

మన వక్షస్థలము యజ్ఞ వేదిక, రోమములు దర్భలు, భుజించాలి అనే కోరిక నెయ్యి, శ్రద్ధ పప్పు, రుచి కూర, ఆకలి చారు, దీక్ష మజ్జిగ. ఇట్లు యజ్ఞ సామగ్రితో చేసేది అన్న యజ్ఞము. ఇందులో గొప్ప విజ్ఞాన శాస్త్రము ఉంది. వైశ్వానరుడు ప్రాణాహుతులకు ఆధారం. మన కడుపు పాత్ర. ఆ పాత్రలో ఆచమనము అనే నీరు పోయాలి. తరువాత ప్రాణాహుతులతో అన్నమును వేసి ప్రాణాది వాయు వులతో అగ్నిని ప్రజ్జ్వలింపచేయాలి. సరిగ్గా ప్రజ్జ్వ లించటానికి నెయ్యి వేయాలి. ఇట్లు అడుగున జలము, ఆ అడుగున పాత్ర, పాత్రలో జలము. పాత్ర అడుగున అగ్ని, అగ్ని మండటానికి ప్రాణాహుతిగా వాయువు. పాత్ర, నీరు, బియ్యము, అగ్ని, గాలి ఇది వంట చేసే విధానం. అలా వండినది ఆ పరమాత్మకు అర్పించా లి. కాదు కాదు పరమాత్మే వండి అనగా వైశ్వానర రూపములో ఉడికించి మనకు పెడుతున్నాడు. ఇది అన్న యజ్ఞము. ఈ భావనతో వైశ్వానర ఆరాధన చే యాలి. భోజనం చేయటమంటే ఇది. ఎందరికి తెలు సు? తెలిసినవారు కూడా ఎందరు ఆచరిస్తున్నారు? మొదట గొంతు జారటానికి, అడ్డు తొలగటానికి ఆచమన రూపంలో నీరును గొంతునుండి కడుపులో జా రుస్తాము. ద్రవం లోపలికి వెళ్ళి అన్నవా #హకను అనగా అన్ననాళికను అన్నద్వారాన్ని శుభ్రం చేసిన తరువాత ఘనాన్ని ఆ హారరూపంలో పంపుతాం.

తరువాత అనగా భోజనం అయిన తరువాత మళ్ళీ ఆచమనం చేస్తాం. దీనివల్ల మనం చేసిన భోజనంలో గొంతులో యేదో మూలలో చిక్కుకు న్న పదార్థాలు తొలగుతాయి. ఇది సైన్సు. అది ఆచారము. రెండు ఆరోగ్య సూత్రాలు తెలుసుకోవాలి. ఆచరించాలి. అందుకే యజ్ఞముతో ప్రజలను సృష్టించాను అన్నాడు పరమాత్మ. ఈ యజ్ఞాన్ని అంద రూ చేయాలి. అందరూ చేస్తారు. దీనికి పైన చెప్పిన ట్లు మన కడుపే యజ్ఞగుండం. వైశ్వానర రూప పర మాత్మయే అగ్నిహోత్రుడు. మన ఆహారమే హవిస్సు. అందుకే పూర్వకాలములో యజ్ఞములే జీవనము. యజ్ఞముల కోసం రాజ్యాలను, రాజులను, ప్రాణాల ను త్యాగం చేశారు. భారతదేశ సంపద అంటే యజ్ఞమే. ఆ యజ్ఞ మునకు కావలసిన హవిస్సును అందించేది గోవు. అందుకే గోవు ను ‘మాతా రుద్రాణాందు హతా వసూనాం’ అంటూ వేదం స్తుతిస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement