Tuesday, September 17, 2024

తృణ భక్షణ న్యాయము

తృణము అంటే గడ్డి. భక్ష ణము అంటే తినడము, భుజిం చడం అని అర్థం. తృణ భక్షణ ము అంటే గడ్డి తినడం. గడ్డిని పశువులు కదా తినేది. మరి తృణ భక్షణ న్యాయము అంటే ఏమి టో చూద్దాం.
యుద్ధంలో శత్రు రాజుల చేతిలో చిక్కినప్పుడు అంటే ఓట మి పాలైనప్పుడు కొందరు రాజు లు తమను చంపకుండా వదిలే యమని ప్రాధేయపడుతూ ఉంటారు. అంటే ”గడ్డి కరవడం అన్నట్లు” అలా వేడుకున్న రాజును ఆ శత్రు రాజు అతడిని నిరపాయకరమైన వ్యక్తిగా, పశు సమానుడిగా భావించి చంపకుండా వదిలేయడాన్ని తృణ భక్షణ న్యాయము అంటారు.
అంటే ఓడిన రాజు ప్రాణ భిక్ష పెట్టమని అర్థించడమూ, అతనివల్ల తనకెలాంటి ప్రమాదం లేదనుకున్నప్పుడు, అతడిని తన పశు సంపదలో ఓ భాగంగా గ్రహంచి రక్షించడమని కూడా చెప్పుకోవచ్చు.
ఎవరికైనా ప్రాణంపై ప్రీతి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ప్రాణ భీతి కూడా ఉంటుంది. కాబట్టి చంపాల్సినంత దుర్మార్గుడైన శత్రువు చేతిలో చిక్కినా అతడిని చంపకుండా, ఎటువంటి అపకారము తలపెట్టకుండా వదిలేయడం మంచిది. అలా చేయడంలోనే మనిషి మంచితనం మానవీయ లక్షణం కనబడుతుంది అంటారు వేమన కవి.

”చంపదగిన యట్టి శత్రువు తనచేత
జిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు
విశ్వధాభిరామ వినురవేమ!”

మహాభారత యుద్ధంలో ద్రౌపది ఐదుగురు కుమారులైన ఉప పాండవులను అశ్వత్థామ క్రూరంగా చంపుతాడు. ఆ తర్వాత అతడు పాండవుల చేతికి చిక్కుతాడు. పాండవులు అతడి ని చంపుతామని అన్నప్పుడు తన కుమారులు మరణించిన అంత దు:ఖంలోనూ అతడిని చంపకుం డా వదిలేయమని చెబుతుంది. తనలాగా అతడి తల్లి పుత్ర వినియోగంతో తల్లడిల్లి పోవద్దని అను కుంటుంది. అది ఆమెలోని మహోన్నత వ్యక్తిత్వం, మాతృ హృదయానికి నిదర్శనం. కానీ నేడు ”గడ్డి కరవడం/ తృణ భక్షణం” అనే పదాన్ని మరో రకంగా ఉపయోగించ డం చూస్తున్నాం.
అవినీతికి పాల్పడిన వ్యక్తులకు వర్తింప చేస్తూ ఫలానా వ్యక్తి ఫలానా విషయంలో కక్కుర్తి పడ్డాడనీ, నానా గడ్డి కరిచి అనుకున్నది సాధించాడని తెలపడానికి ఈ న్యాయమును ఉదాహరణగా చెప్పడం గమనార్హం. ఇలా ఈ న్యాయాన్ని మంచికి, చెడుకు మధ్య రకరకాలుగా ఉదహరిస్తున్నా మనం మంచినే పరిగణనలోకి తీసుకుందాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement