పూర్వం ఒక మహా పండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేవాడు. ఇతను శ్రీ మహావిష్ణువుకు పరమభక్తు డు. పూట గడవని దారిద్య్రం. ప్రతి నిత్యమూ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి, భిక్షాటనకు వెళ్లేవాడు, ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునే వాడు. భార్య పరమ గయ్యాళి, దైవాన్ని నమ్మదు. ప్రతి నిత్యంలా ఆరోజు కూడా విష్ణుసహస్రనామ పారాయణము చేస్తుండగా భార్య వచ్చి ”ఏమిటి చేస్తు న్నావు?” అంది. దానికి భర్త ”విష్ణుసహస్ర నామాలను స్తోత్రం చేస్తున్నానన్నాడు. అందుకు ఆ భార్య ”ప్రతీరో జూ స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా! ఏమిచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు? అడుక్కోవడానికి భిక్షాపాత్ర తప్ప, ఏదీ! నువ్వు చదువుతున్నదేమిటో చెప్పు” అంది. అందుకు భర్త ”ఎప్పు డూ పాడు మాటలు మాట్లాడే నీకు విష్ణు సహస్రనామాలేమి అర్ధమౌతాయి?” అన్నాడు.
”వెయ్యి నామాలక్కరలేదు. మొట్ట మొదటిది చెప్పు” అన్నది. భర్త ”విశ్వం విష్ణు:” అని చెప్పబోతూ ఉంటే ”ఆపు! దీన ర్ధమేమిటో చెప్పు” అంది. అందుకు భర్త ”విశ్వమే విష్ణువు, ఈ ప్రపంచమంతా విష్ణుమయమే” అని వివరించగా ”ప్రపం చమంతా విష్ణువే అంటున్నావు, అందులో నువ్వూ, నేనూ ఉ న్నామా? ఉంటే యాచిస్తేగాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ కూడా ప్రతీరోజూ నువ్వు శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నావే? అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా? కనుక ఈ మంత్రానికి అర్ధంలేదయ్యా!” అంది.
భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు ”నా భార్య మాటలు కూడా నిజమేనేమో? విశ్వమంతా విష్ణువే ఐతే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి? ” ఈ మంత్రంలో ‘విశ్వం’ అనే పదాన్ని చెరిపేస్తానని ఒక బొగ్గు ముక్కతో ‘విశ్వం’ అనే పదాన్ని కనబడకుండా మసి పూసి (తాటాకు ప్రతి ఉండేదిట ఈ భక్తుడి ఇంట్లో) ఎప్పటిలాగే యాచనకై బయలుదేరాడు.
ఆ తరువాత వైకుంఠంలో పాల సముద్రంలో శ్రీమహా విష్ణువును సేవిస్తున్న శ్రీమహాలక్ష్మి స్వామి ముఖాన్ని చూసి ఫక్కున నవ్విందిట! అందుకు శ్రీమహావిష్ణువు ”ఏమిటి దేవీ? నన్ను చూసి నవ్వుతున్నావు?” అనగా, అమ్మవారు ”నాథా! మి మ్ములను నల్లనివాడని, నీలమేఘశ్యాముడంటే మాత్రం ఆ నల్లటి రంగును ముఖాని కి పూసుకోవాలా” అనగా మహావిష్ణువు పాల సము ద్రంలో చూడగా ముఖానికి నల్లరంగు కనబడిందిట.
వెంటనే శ్రీమహావిష్ణువు జరిగినదంతా దివ్యదృష్టితో గమనించి, ”దేవీ! ఇది నా పరమ భక్తుడు చేసిన పని”యని అన్నాడు. లక్ష్మీదేవి ”అదేమిటి స్వామీ! పరమ భక్తుడంటున్నా రు? ఎందుకిలా చేస్తాడ”ని అంది. స్వామి తన భక్తుని జీవిత దీన స్థితిని వివరించగా లక్ష్మీదేవి ”అంతటి పరమ భక్తుని దీన స్థితికి కారణమేమి? మీరాతనిని ఉద్దరింపలేరా!” అంది ”దేవీ! గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే ఐనప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి యెరుగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైన నూ దరిద్రమనుభవించుట తప్పలేదు. నేటితో ఈతనికి కష్ట ములు తొలగించెదన”ని మానవ రూపంలో ముఖానికి వస్త్ర ము చుట్టుకొని భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు.
ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువే షములోనున్న శ్రీమహావిష్ణువు ఆ ఇల్లాలితో ”అమ్మా! నీభర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చుటకు వచ్చితిని” అన్నాడు. ఆ ఇల్లాలు ”నీవెవరవో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్య్రంలో ఉన్నాము, ఎవరనుకుని మా ఇంటికి వచ్చారో అనగా స్వామి ”లేదమ్మా! నేను పొరబా టు పడలేదు, నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో! నువ్వు స్వీకరించ”ని ఆమెకు అశేష సంపద, తరాలు తిన్నా తర గని ఆహార ధాన్యాలూ కానుకలుగా ఇవ్వగా ఆ ఇల్లాలు ”నీ ము ఖం చూపించు! నా భర్తకు చెప్పాలి. నువ్వు ఎలా ఉంటావో?” స్వామి ”అమ్మా! నా ముఖాన్ని నీకు చూపలేను, నా ముఖం మీద ఎవరో నల్లరంగు పూసారమ్మా! నేనెవరో నీ భర్తకు తెలు సులే!” అని విష్ణుమూర్తి వెళ్ళిపోయాడు. ఇంతలో భక్తుడు ఇం టికి తిరిగిరాగా అతని పూరిగుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది, భార్య వచ్చి జరిగింది చెప్పగా నమ్మలేకపోయాడు.
”ఆ వచ్చినవాడు ఎలా వున్నాడు? అంటే ”నేను అతడి ముఖాన్ని చూడలేదు. అతడి ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారుట, ముఖము చూపించలేనంటూ వస్త్రంతో కప్పు కున్నాడు. అయినా అతడు వెళుతూ వెళుతూ నా గురించి నీ భర్తకు తెలుసమ్మా అని చెప్పి వెళ్లిపోయాడ”న్నది. అది విన్న భక్తుడు హతాశుడై భార్యతో ”వచ్చినవాడు మరెవరో కాదు, సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే! ప్రతి నిత్యమూ నేను విష్ణువును స్తుతి స్తున్నా ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను, ఏ జన్మ పుణ్య మో నీకు స్వామి దర్శనం కలిగింది” అని లోపలికి వెళ్లి ఉదయ ము విష్ణు స#హస్రనామాలలో ‘విశ్వం’ అనే నామంపై పులిమిన నల్లరంగు తొలగించి భార్యతో ”నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడ”ని అడిగి ఆ దిక్కుగా భక్తుడు వెళ్ళగా సముద్రము ఒడ్డుకు చేరుకున్నాడు. చేతులు జోడించి శ్రీమహావిష్ణువు స్తోత్రం చేశాడు. అప్పుడు అశరీరవాణి ”భక్తా! పూర్వజన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మలో నీకు భగవద్ద ర్శనము కలుగదు, మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహత్యాన్ని పొందెదవు” అని పలికినది. ఇదే విష్ణుసహస్ర నామాన్ని నిత్యపారాయణ చేయడం వలన కలుగు ఫలితం.
విష్ణు సహస్రనామ మహిమ!
Advertisement
తాజా వార్తలు
Advertisement