Friday, November 22, 2024

సాయి లీలా వైభవం!

నారాయణ్‌ మోతీ రాంజనే పెద్దకొడుకు ధ్యాననాథ్‌ నా రాయణ్‌ జాని. చిన్నతనం నుండే తల్లిదండ్రులతో పాటు ఇతనికి కూడా దైవభక్తి అబ్బింది. దాసగణు మహారాజ్‌, సొనొపంత్‌ దండేకర్‌, ధుండా మహరాజ్‌, రంగ నాథ్‌స్వామి ప్రభానికర్‌ వంటి సుప్రసిద్ధ సాధు సత్పురుషుల ను దర్శించి వారి ఆశీర్వచనాలను పొందాడు. వారి ప్రవచనా లను విన్నప్పుడు నేనూ వీరి వలె ఆ పరమాత్మను దర్శించగ లనా? ప్రహ్లాదుని వలె అనన్య భక్తిని సాధించగలనా? భగవం తుని ప్రతిరూపమైన సద్గురువును కనీసం కలుసుకొని సేవిం చగలనా? అని వివిధ రకాలైన ప్రశ్నలు అతనిని వేధిస్తుండేవి. దానితోపాటుగా చిన్నతనం నుండే ఒంటరిగా వుండడం అల వాటు చేసుకున్నాడతను. ప్రతీరోజూ స్కూలు నుండి వచ్చేట ప్పుడు తమ స్కూలుకు దగ్గరలో వున్న పార్వతి కొండపై వున్న అమ్మవారిని దర్శించుకుంటుండేవాడు.
పూణలోని కసబాపేటలో శ్రీ భైరవనాథుల గుడి వుండేది. హరనాథ్‌ బాబా అనే ఒక సాధు పుంగవుడు అక్కడ నివసిస్తుం డేవారు. ఒకరోజు ధ్యాననాథ్‌ జాని పార్వతి కొండపై ఒంటరి గా కూర్చొని వుండగా హరనాథ్‌ బాబా అక్కడికి వచ్చి తనకు కలలో శ్రీ సాయినాథులు కనిపించి తన దర్శనం కోసం ఒక బాలుడు తపిస్తున్నాడ ని, వెంటనే వెళ్ళి అతనిని శిష్యుడుగా స్వీక రించి ఆధ్యాత్మిక సాధనలో శిక్షణ ఇవ్వమని చెప్పా రని” అన్నారు. అందుకు ధ్యాననాథ్‌ జానికు ఎంతో ఆనందం కలిగింది. వెంటనే హరినాథ్‌ బాబాకు సాష్టాంగ ప్రణామం చేసాడు. గురువుగారికి అత్యంత భక్తిశ్రద్ధలతో శుశ్రూషలు చేసి వారి నుండి యోగము, భక్తి, ధ్యానము, వైరాగ్యములకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకున్నా డు ధ్యాననాథ్‌ జాని.
తన గురు సేవ గురించి ధ్యాననాథ్‌ జాని ఇలా రాసాడు. ”నా గురువుగారైన హరినాథ్‌ బాబా నాకు అతి నిగూఢమైనట్టి ఆధ్యాత్మిక సాధనలను అర్పించారు. అం దుకు వారికి వారి పరాత్పర గురువైన శ్రీ సాయినాథులకు వే లవేల వందనాలను అర్పించుకుంటున్నాను. ఒక సందర్భం లో అయితే ఒక గుహలో గోరక్‌నాథ్‌ ప్రతిమ ఎదుట నన్ను ధ్యానం ధారణలో గంటలకొద్దీ కూర్చోబెట్టారు. అన్నపానీ యాదుల సంగతే మరిచిపోయాము. సాయినాథులు, హరి నాథ్‌ బాబాల దయ వలన నాకు ఆత్మ సాక్షాత్కారం కలిగింది. నాకు కుండలినీ జాగృతి సిద్ధించిన తర్వాత నా సద్గురువు నా కు నాథ సాంప్రదాయానికి సంబంధించి ఎన్నో రహస్యాలను నేర్పించారు”
తన సర్వశక్తులను శిష్యునికి ధారపోసిన తర్వాత హర నాథ్‌ బాబా 28-04-1950లో శ్రీరామ నవమి పర్వదినమున దేహ త్యాగం చేసారు. తన గురువు అభీష్టం మేరకు రాయగడ జిల్లా కర్జత్‌ తాలూకా పలస్దరీ అనే మఠం వద్ద ఆయనను సమాధి చేసి అన్ని లాంఛనాలను పూర్తిచేసాడు ధ్యాననాథ్‌ జాని. సాయినాథుని ఆశీస్సులతో, సద్గురువు హరనాథ్‌ బాబా పర్యవేక్షణలో ఒక గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్తగా రూపొందిన ధ్యాననాథ్‌ జాని జీవితం ధన్యం.
ధ్యాననాథ్‌ జానీ తాను మహారాష్ట్రలో నలుమూలలకు పర్యటించి శ్రీ సాయినాథుని లీలా వైభవం గురించి విశేషంగా ప్రచారం చేసాడు. ఎంతోమంది సాధకులకు ఆయన ఆదర్శ ప్రాయుడయ్యాడు. ఆవిధంగా ఆధ్యాత్మిక పంథాలో తన జీవితమంతా నడిచి తండ్రికి మించి న తనయుడిగా పేరు గాంచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement