Friday, November 22, 2024

అధికార నందిపై ఆదిదేవుని వైభవం

శ్రీకాళహస్తీశ్వరాలయం, ప్రభ న్యూస్‌: శ్రీకాళహస్తీశ్వరాల యంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆది దేవుడు అధికార నందిపై పురవిహా రం చేశారు. ఆదిదేవుని దేవేరి జ్ఞాన ప్రసూనాంబదేవి కామధేనువుపై ఆయనను అనుసరించారు. అంత కు ముందు అలంకార మండపం లో గంగా భవానీ సమేత శ్రీకాళ హస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరిం చారు. ఆలయ పురోహితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం గంగాభవానీ సమేత శ్రీ కాళహస్తీశ్వరుని అధికార నందిపై… జ్ఞాన ప్రసూ నాంబ అమ్మవారు కామధేనువుపై పురవిహారానికి తీసుకొచ్చారు. మూషిక వాహనంపై వినాయకుడు, చప్పరాలపై శ్రీవళ్లీ, దేవపేన సమేత కుమారస్వామి, చండికేశ్వ రుడు, భక్తకన్నప్ప స్వామి, అమ్మవార్లను అనుసరించారు. మంగళవాయిద్యాలు, మేళతాళా ల మధ్య పురవిహారానికి వచ్చిన ఆదిదంపతులను దర్శించు కోవడానికి భక్తులు బారులు తీరారు. కర్పూ ర హారతులు, సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
నేడు సభాపతి కల్యాణం..
శ్రీకాళహస్తీశ్వరాలయంలో బ్రహ్మోత్సాలను పురస్కరించుకుని శుక్రవారం సభాపతి కల్యాణం నిర్వహించనున్నారు. సభాపతిగా పిలువబడే నట రాజస్వామికి శివకామసుందరితో కల్యాణం నిర్వహి స్తారు. ఈ కల్యాణం ఆలయ ప్రాంగణంలోని 16కాళ్ల మండపం వద్ద జరుగుతుంది. ఇక సభాపతి కల్యాణం జరిగే రాత్రిని ఆనందరాత్రిగా వ్యవహరిస్తారు. నాగభూషణుడు నటరాజుగా ఆనంద తాండవం చేస్తాడు. నారద తుంబరుడు, సకల యక్ష, గాంధర్వ గానంతో, వాయిద్య ఘోషతో ఆనందరాత్రి వేళ -కై-లాసగిరులు ప్రతిధ్వనించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement