Thursday, November 21, 2024

మహిమాన్వితం మహామాఘి

నక్షత్ర మండల మార్గాన్ని అనుసరించి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. కాని ఏడాదిలో ఒకేసారి చంద్రుడు పదహారు కళలతో ఒప్పుతూ మఘ నక్షత్రంలో ప్రవేశిస్తాడు. అదే మాఘపూర్ణిమ. దానినే ”మహామాఘి” అంటారు. చంద్రు డు కాంతి నిస్తంద్రుడై ప్రకాశించే దినాలు ఏడాదికి పన్నెండు ఉంటాయి. అవే పదహారు కళలతో ఒప్పుతూ చంద్రుడుండే రోజులు. పన్నెండు పౌర్ణమిలలో ఒక్కొక్క నక్ష త్రంతో చంద్రుడు కూడి ఉంటాడు. ఆయా నక్షత్రాలను బట్టి ఆ పౌర్ణమిని పిలుస్తారు. మాఘ నక్షత్ర యుక్త పూర్ణిమను మాఘీ యని, అలాగే ఫాల్గుణీ, చైత్రీ, వైశాఖీ, జ్యేష్ఠీ, ఆషాడీ, శ్రావణీ, భాద్రపదీ, ఆశ్వయుజీ, కార్తీకీ, మార్గ శీర్షీ అనే పేర్లతో పిలువబడేవి #హందువులకు పన్నెండు పర్వాలు. భోగ్య అర్హమైన శుక్లపక్షం వెన్నెల ఊరికే పోకుండా మన పెద్దలు శుక్ల పక్షంలోనే పండువలు అధికంగా ఏర్పరిచా రు. దశావతారాల్లో ఒకటైన కూర్మావతారం, మహా భక్తుడైన #హన్మంతుడు, మానవ ప్రపంచం లో మ#హనీ యుడైన గౌతమ బుద్ధుడు పౌర్ణమిలయందే జన్మించా రు. ఇక మాఘ పూర్ణమి విషయానికి వస్తే… మఘ నక్షత్రంలో చంద్రుడు పదహారు కళలతో ప్రకాశించే దినమే మాఘ పౌర్ణమి.
పార్వతీదేవి ఈ దినముననే ప్రాదర్భవించినదని పురాణాధారం. దక్షప్రజాపతికి దక్షిణావర్తపు శంభాకా రపు పద్మ ఆకారాన్ని ధరించిన సతీదేవి #హస్తస్పర్శతో కన్యగా మారిన రోజే మాఘ పౌర్ణిమ. కావేరీ ఉత్తరాన స్వా మిమలపై వెలసిన సుబ్ర#హ్మణ్య స్వామి, తెలియని విష యాన్ని విద్యావేత్తయైన తన తండ్రికి చెప్పిన దినమైనం దున అక్కడ ఈ రోజు ఉత్సవం జరుగుతుంది. మాహా మాఘి. నాడే జగద్గురువు ఆదిశంకరులు పంచాయతన పూజావిధిని ప్రారంభించారంటారు. మహామాఘి అన బడే ఈ పర్వం పేరిటనే కుంభకోణంలో దాదాపు ఇరవై ఎకరాల వైశాల్యం కలిగిన ఒక కోనేరు ఉంది. తంజా వూరు తెలుగు నాయక రాజులు ఆ కోనేటి చుట్టూ రాతి పావంచాలు, గట్టు చుట్టూ నలువైపులా పదహారు దేవ ళాలు కట్టించారు. అందులో విశ్వనాథ దేవాలయం ఒకటి. అది కోనేరు ఉత్తరాన ఉంది. ఆ ఆలయంలో శిలల పై గల శిల్పచిత్రాకృతులు ఉండగా, మాఘ పూర్ణిమనా డు నవ నదులకు గొప్ప అర్చన జరుగుతుంది. కుంభ కోణంలోని కోనేరులో గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, కావేరి, కృష్ణ , కుమారి, పయోషిణి అనే నవ నదులు ప్రవేశిస్తాయని, అందుకే పౌర్ణమి నాడు సదరు కోనేట్లో తైర్ధికులు స్నానాలాచరించడం పరిపాటి. మఘ నక్షత్రాధిపతియైన బృ#హస్పతిని ఈనాడు పూజిం చాలని చెపుతారు. మాఘ పౌర్ణమి ద్వాపర యుగాది యని కొన్ని గ్రంథాలు చెపుతున్నాయి. ఈ పర్వదినం నాడు అరుణోదయ స్నానం, తిలపాత్ర కంచుక కంబళా ది, తిల హోమం, తిలదానం, తిలభక్షణం చేయాలి.
అన్ని పౌర్ణమిల్లో కల్లా మహా మాఘి చాలా విశిష్టమై నది. మాఘ మాసంలో దేవతలు తమ సర్వశక్తులు, తేజ స్సులను జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘ స్నా నం చాలా గొప్పది. నది దగ్గరలో లేని వారు కనీసం చెరు వులోగానీ, కొలనులోగానీ, లేక బావి దగ్గర గానీ స్నానం ఆచరించాలి. మాఘ స్నానం ప్రవా#హ జలంలో చేస్తే అధిక ఫలితం. స్నానానంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.
– రామకిష్టయ్య సంగనభట్ల , 9440595494

Advertisement

తాజా వార్తలు

Advertisement