Thursday, November 21, 2024

శ్రీశైలంలో వైభవంగా అంకురార్పణ

శ్రీశైలం, ప్రభ న్యూస్‌ : శివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళ వారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఈవో లవన్న యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా గణపతి పూజ, శివసం కల్పం, చండీశ్వర పూజ, కంకణధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం నిర్వహించారు. సాయంత్రం 5:30 గంటలకు అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన ప్రత్యేక పూజల అనంతరం 7 గంటల నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ చేశారు. ప్రతిరోజూ శివపార్వతులకు రుద్రహోమాలు, నిత్యహోమాలు జరిపించ టంతో పాటు- ప్రత్యేక పూజలు అందుకునే ఆది దంపతులకు రేపటి నుండి వివిధ పుష్పాలతో సుగంధ ద్రవ్యాలతో అలంకరించిన వాహన సేవలో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం వివిధ వాహనసేవలతో శ్రీశైల క్షేత్రంలో గ్రామోత్సవం జరుగుతుందని దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న తెలిపారు. పదకొండు రోజుల పాటు- జరిగే ఈ బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీన ముగియనున్నాయి.
భక్తులకు సకల సౌకర్యాలు:ఈవో లవన్న
శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్ర్రహ్మోత్సవాలకు భక్తుల కోసం ఏర్పాటు- చేసిన వివిధ వసతులను దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్‌. లవన్న మంగళవారం పరిశీలించారు. ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం పలుచోట్ల చలువ పందిళ్లు మంచినీటి సదుపాయం, దర్శన ఏర్పాట్లు- వైద్యసేవలు పారిశుద్థ్యం మొదలైన ఏర్పాట్లను పరిశీలించారు. టూరిస్ట్‌ బస్టాండ్‌వద్ద గల డార్మెంటరీ మల్లికార్జున సదన్‌ గంగ గౌరీ సదన్‌ సముదాయం కుమార సదన్‌ పాతాళగంగ మార్గంలోని నందీశ్వర డార్మెంటరీ చండీశ్వర సదన్‌ చండీశ్వర డార్మెంటరీ పలుచోట్ల ఏర్పాటు -చేసిన మంచినీటి సౌకర్యాలను ఆయన పరిశీ లించారు. అనంతరం లవన్న మాట్లాడుతూ శ్రీశైలం భ్రమ రాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్లను దర్శించు కునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు కలగ కుండా నిరంతరం మంచినీటి సరఫరా జరుగుతూ ఉండాలా చూడాలని అధి కారులను ఆదేశించామన్నారు. అలాగే పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధకనబరచాలని, డార్మెటరీలలో పనిచేసే సి బ్బంది వచ్చే భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఆయన అన్నారు. అనం తరం. దేవస్థానం ఏర్పాటు- చేసిన సౌకర్యాల గురించి . కార్యనిర్వహణాధికారి ఎస్‌ లవన్న భక్తులను అడిగి తెలుసుకున్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానం తరఫున పట్టువస్త్రాల సమర్పణ
శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భ్రమరాంబదేవి మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లకు శ్రీ కాళహస్తి దేవస్థానం తరపున మంగళవారం ఆ దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న శ్రీకాళహస్తి ఆలయ అధికారులకు శ్రీశైల దేవ స్థానం ఈవో లవన్న ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు విశేష అర్చనల అనంతరం పట్టు- పట్టువస్త్రాలు అలంకరించారు. హారతు లిచ్చారు. శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి పెద్ది రాజు మాట్లాడుతూ మొదటిసారి మహాశివరాత్రి బ్రహ్మో త్సవాల్లో శ్రీశైల భ్రమరాంబా దేవి మల్లికార్జునస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించటం ఆనందంగా ఉందన్నారు.

భ్రమరాంబాదేవికి బంగారు హారాలు
శ్రీశైలంలో మంగళవారం మంత్రాలయం మాజీ పార్ల మెంట్‌ సభ్యులు వై .సీతారాంరెడ్డి గిరిజమ్మ దంపతులు స్వామి, అమ్మవార్లకు బంగారు హారాన్ని భక్తిపూర్వకంగా సమర్పించారు. ఈ హారం బరువు 109 గ్రాముల 400 మిల్లీ గ్రాములతో తయారు చేయించినట్లు- దాతలు తెలిపారు. మామిడి పిందెల హారం రాళ్లతో కూడిన డాలర్లని తెలిపారు. అలాగే మంత్రాలయం నియోజకవర్గ సభ్యులు. వై.బాలనాగిరెడ్డి జయమ్మ దంపతులు 96 గ్రాముల వంద మిల్లీగ్రాముల బరువు గల లక్ష్మీకాసుల బంగారు హారాన్ని అమ్మవారికి అందజేశారు. వీరివురు హారాల ను అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్‌.లవన్నకు అంద జేశారు.అనంతరం దేవస్థానం అధికారులు దాతలకు భ్రమరాంబాదేవి మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి స్వామి అమ్మవార్ల శేషవస్త్రంతో ఆశీర్వదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement