సకల వేదాలకు మంత్రాలకు ఆదిలో వెలువడే ప్రణవ స్వరూపుడే గజాననుడు. విశ్వం లోని విఘ్నాలన్నింటిని అణిచివేయ డానికి విఘ్నరాజై, భక్తుల సర్వకార్య సర్వా భీష్టాలను నెరవేరుస్తూ భక్తుల కొంగుబం గారమై, మహిమాన్విత మూర్తిగా శోభిల్లు తూ, ప్రపంచంలో అరుదైన అత్యంత విశిష్టమైన మరకతము (పచ్చ- ఎమ రాల్డ్)తో మలచిన మరకత శ్రీలక్ష్మీ గణ పతి స్వామి దర్శనం సకల పాప వినాశ నం- మహామంగళప్రదం. మానవ జీవి తంపై నవగ్రహాల దశ, అంతర్దశ స్థితులు ఆధారంగా చూపే దుష్ప్ర భావాలను దూరం చేసుకోవడానికి సవర్ణ, సపత్నీ, సవాహన పూర్వ క నవగ్రహాల ఆరాధన ఎంతో శ్రేయోదాయకము. ఇంతటి శ్రేష్టమైన అపురూ పమైన నవగ్రహాల మంటపం మనకు మరకత శ్రీలక్ష్మీగణపతి దేవాలయంలో దర్శనమిస్తుంది.
మరతక శ్రీలక్ష్మీగణపతి స్వామివారికి సుప్రభాతసేవ, అభిషేకము, లక్ష్మీగణపతి హోమాలు, చతురావృత్తి తర్పణాలు, సహస్రనామార్చన, దూర్వాయుగ్మ పూజలు నిర్వహిస్తారు. మాసోత్సవములలో భాగంగా ప్రతీ సంకష్టహర చతుర్ధి రోజున విశేషమైన పూజలు చేస్తారు.
స్థల చరిత్ర
ఈ దేవాలయము సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి 5 కి.మీ దూరం లో కల మిలటరీ డైరీఫారమ్ రోడ్ కానాజీగూడలో నిర్మితమయింది. పరబ్రహ్మ స్వరూపిణి, భగవతి, శ్రీలలితాదేవి స్వప్న సాక్షాత్కార దర్శన ఆదేశానుసారము ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ప్రపంచంలో అరుదైన దేవాలయములలో ఒకటిగా అత్యంత విశిష్టమైన మరకత శ్రీ లక్ష్మీగణ పతి స్వామి, నవగ్రహాలను శ్రీ దుర్ముఖినామ సంవత్సరం చైత్ర బహుళ పంచమి బుధవారం అనగా 29.4.2016న పుష్పగిరి పీఠాధిపతి శ్రీశీశీ అభినవోద్దండ విద్యాశంకర భారతీస్వామి, హిందూ దేవాలయ ప్రతిష్ఠా పన పీఠాధిపతి శ్రీశీశీ కమలానంద భారతీస్వామి, బ్ర.శ్రీ. డా. దేవీశ్రీ గురూజీచే మరకత శ్రీలక్ష్మీ గణపతిస్వామి, విగ్రహ ప్రతిష్ఠ, నవ గ్రహ ప్రతిష్ఠ, శిఖర, కుంభాభిషేక ములు వేద పండితులు, ఋత్వికుల వేదపా రాయణతో ఆచార్య చూడామణి మాడుగుల మాణిక్య సోమయాజులు గారి వైదిక నిర్వహణలో నిర్వహించారు.
ఆలయ ముఖద్వారం అయిన గాలిగోపురం నుండి 37 మెట్లు ఎక్కి పైకి రాగానే 50 అడుగుల ఎత్తులో, రాగితాపడంతో సుందరమెన చెక్క డంతో దేదీప్యమైన శోభతో ధ్వజస్తంభం కన బడుతుంది. గర్భాలయంలో మరకత శ్రీలక్ష్మీ గణపతి స్వామివారు కొలువై వున్నారు. స్వామి దశహస్తములలో ఖడ్గం, చక్రం, అం కుశం, పాశం, గద, జామపండు, పద్మం, ఔషధీ పాత్ర, చెరుకుగడ, దంతపు కొమ్ము కలిగిన వరదహస్తాన్ని చూపిస్తూ, కుడివైపు తిరిగిన తొండములో రత్న కలశాన్ని కలిగి వామాంకముపై కలువపూవు ధరించిన లక్ష్మీదేవి ని కూర్చుండబెట్టుకుని, మహా శక్తులన్నింటిని తన లో యిముడ్చుకున్న మరకత శ్రీలక్ష్మీ గణపతిస్వామి దర్శనం దర్శనమిస్తా రు. గర్భాలయం ద్వారంపై స్వామివారి వాహనం మూషికం వుంటుంది. స్వామివారికి దృఢ సంకల్పంతో 11 ప్రదక్షిణలు చేయాలి. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు భక్తితో స్వామి వారికి 11 ప్రదక్షిణలు చేసి తమ కోరిక విన్నవించుకుని మొక్కు కుంటే ఆ కోరిక నెరవేరుతుంది. ఆ తరువాత 108 ప్రదక్షిణలు చేస్తారు.
స్వామివారిని ఆరాధించి శారీరక, మానసిక రుగ్మతలు, చర్మ వ్యాధులు, ఆర్థిక, కోర్టు, ఋణబాధల నివారణ, విద్య, విదేశీయాన, ఉద్యోగ, వివాహ, సంతానం పొందవచ్చు. వృషభ, మిధున, కన్య, వృశ్చి క, మీనరాశులవారు, 5,7,14,16, 23,25 తేదీలలో పుట్టినవారు మరకత శ్రీలక్ష్మీగణపతి స్వామిని ఆరాధించి సకల శుభాలను పొందగలరు.
ఆది ప్రణవ స్వరూపుడి బ్రహ్మోత్సవాలు
ప్రతి సంవత్సరం చైత్ర బహుళ పాడ్యమి నుండి పంచమి వరకు మరకత శ్రీలక్ష్మీగణపతి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. నవరాత్రి మహోత్సవములో స్వామి వారు వరసిద్ధి, మహాగణపతి, వికట, లంబోదర, గజానన, మహోధర, ఏకదంత, వక్రతుండ, విఘ్నరాజ, దూమ్రవర్ణ, చివరి రోజున మరకత శ్రీ లక్ష్మీగణపతిగా దర్శనమిస్తారు. అభిషేక, హోమాదుల తరువాత ఏకవింశతి దివ్యపత్రములతో అర్చన చేసి తదనంతరం మహానీరాజ నాలు, తీర్థప్రసాద వితరణ జరుగుతాయి.
‘కాయక సేవయే కాత్యాయని సేవ’
పూజ్యగురువులు, దేవీ ఉపాసకులు, లలాటరేఖా శాస్త్ర నిపుణులు, విద్యా వేత్త, సంఘసేవకులు, ఆధ్యాత్మిక ప్రచారకులు, వాచస్పతి బిరుదాంకితులు బ్ర.శ్రీ. డా. మోత్కూరు సత్యనారా యణశాస్త్రిగారు. ‘నువ్వు కారణ జన్ముడివి’రా అని వారి గురుదేవుల చే ఆశీర్వాదం పొంది, వారి ద్వారానే ఈ జన్మకుకారణం తెలుసుకొని ఆ మార్గంలో కార్యోన్ముఖులై ‘కాయక సేవయే కాత్యాయని సేవ’ ని నమ్మిన సిద్ధాంతంలో ప్రయాణం కొనసాగిస్తున్నారు పూజ్య గురువులు మోత్కూరు సత్య నారాయణశాస్త్రిగారు. అమ్మవారు ఆజ్ఞమేరకు ఆలయం నిర్మించారు. మరక త శ్రీలక్ష్మీగణపతి వారిని ప్రతిష్టించి స్వామివారి కృపను భక్తు లకు పంచుతున్నారు. దేవాలయ ట్రస్టును ఏర్పాటుచేసి అనేక కార్య క్రమాలను నిర్వహిస్తున్నారు. సత్యనారాయణశాస్త్రిగారి తండ్రి మో త్కూరు రామశాస్త్రి చారటబుల్ ట్రస్టు ద్వారా అనేక మెడికల్ క్యాంపు లను నిర్వహిస్తూ అనేక సామాజిక సేవలను చేస్తున్నారు.