అన్నమాచార్య భావనా వాహిని 41వ సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా అన్నమయ్యపురంలో అంకిత భావ దినోత్సవం ఘనంగా జరిపారు. మధ్యాహ్నం 12గం.లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6గం.ల నుండి సాగిన స్వరార్చనలో భాగంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారి శిష్య బృందం చి. ధన్యోస్మి ‘గణరాజ, గుణరాజ’ అంటూ తొలుత గణపతిని ఆరాధించగా ‘సాందీప్, గాయత్రి, చైత్ర, రన్విత, తదితరులు’ సంయుక్తంగా ‘ఆకాశమడ్డమా, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, చాలదా హరినామ, నన్ను జూచి హరి నీకు’ అనే బహుళ ప్రాచుర్యం పొందిన అన్నమయ్య సంకీర్తనలు ఆలపించగా వాటికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చక్కగా వ్యాఖ్యానం అందించారు. వీరికి కీ బోర్డు మీద రాజు, తబలా మీద జయకుమార్ ఆచార్య వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా ‘శంకరాభరణం’ ఫేమ్ ‘శ్రీమతి మంజు భార్గవి’ గారు, సిటాడెల్ దర్శకులు, ది ఫేమిలీ మెన్ ఫేమ్ ‘రాజ్ నిడిమోరు’ గారు విచ్చేసి, శోభా రాజు గారికి తమకు గల అమూల్యమైన అనుబంధం తెలిపి, అన్నమయ్య సంకీర్తనల ప్రచారం కోసం ఆమె చేసిన కృషి గురించి వివరించారు. కార్యక్రమానంతరం శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement