తిరుమల (ఆంధ్ర ప్రభ) : యుద్ధ ప్రాతిపదికన ఘాట్ రోడ్డు మరమ్మతులు చేపడుతున్నట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. నేటి సాయంత్రానికి ఢిల్లి నుంచి ఐఐటీ నిపుణుల వస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డౌన్ ఘాట్‌రోడ్డు ద్వారా రాకపోకలు కొనసాగుతున్నాయి. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో ధ్వసంమైన రెండవ ఘాట్ రోడ్డును టీటీడీ చైర్మన్ పరిశీలించారు. తిరుమల అప్ ఘాట్‌రోడ్డు మరమ్మతులు పూర్తి అయ్యే వరకు డౌన్‌ఘాట్ రోడ్డులోనే వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు బుక్ చేసుకొని తిరుమలకు వచ్చే భక్తులు భారీ వర్షాల దృష్ట్యా తమ ప్రయాణం వాయిదా వేసుకుంటే ఆరు నెలల్లోగా దర్శనం తేదీ మార్పు చేసుకునే అవకాశం కల్పిస్తుట్లు తెలిపారు. నడకదారిలో తిరుమలకు వెళ్లే భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని టీటీడీ చైర్మన్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..