అధ్యాయం 18, శ్లోకం 16
16.
తత్రైవం సతి కర్తారమ్
ఆత్మానం కేవలం తు య: |
పశ్యత్యకృతబుద్ధిత్వాత్
న స పశ్యతి దుర్మతి: ||
తాత్పర్యము : కనుక ఈ ఐదు అంశములను గుర్తించక తననే కర్తగా భావించువాడు నిక్కముగా బుద్ధిహీనుడు. అట్టి మూఢుడు విషయములను యదార్థ దృష్టితో గాంచలేడు.
భాష్యము : పరమాత్ముడు హృదయము నందు మిత్రుని రూపమున నిలిచి యుండి తనచే కార్యములు చేయించుచున్నాడని మూఢుడైనవాడు తెలిసికొనజాలడు. కార్య స్థానమైన దేహము, కర్త, ఇంద్రియములు, ప్రయత్నము అనునవి కార్యము యొక్క భౌతిక కారణములు కాగా, పరమాత్ముడు చరమ కారణమై యున్నాడు. కనుక ప్రతి ఒక్కరు ఈ నాలుగు భౌతిక కారణమునే గాక పరమకారణమును సైతము గాంచవలసి ఉన్నది. పరమాత్ముని గాం చనివాడే తనను తాను కర్తగా భావించును.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..