Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 6
6.
మహర్షయ: సప్త పూర్వే
చత్వారో మనవస్తథా |
మద్భావా మానసా జాతా
యేషాం లోక ఇమా: ప్రజా: ||

తాత్పర్యము : సప్తమహాఋషులు, వారికి పూర్వము సనకసనందనాదులు మరియు మనువులు నా మానసము నుండియే ఉద్భవించిరి. వివిధలోకములందలి సర్వజీవులు వారి నుండి జన్మించిరి.

భాష్యము : మొట్టమొదట భగవంతుని శక్తి నుండి ఉద్భవించినది బ్రహ్మ. ఆయన నుండి సప్త ఋషులు, చతుష్కుమారులు, పదునాలుగు మనువులు వచ్చుట జరిగినది. ఇలా ఈ ఇరువది మంది నుండి సర్వలోకములందు జీవరాశులు ఉద్భవించినవి. ఆ విధముగా వీరందరూ సృష్టికి కారకులైన పూర్వికులు. అలా బ్రహ్మ మనందరికి పితామహుడైతే ఆయనకు తండ్రియైన శ్రీకృష్ణుడు ప్రపితామహుడని రాబోవు అధ్యాయములో తెలుసుకొనెదము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో

Advertisement

తాజా వార్తలు

Advertisement