Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 9, శ్లోకం 33

కి పునర్బ్రాహ్మణా: పుణ్యా
భక్తా రాజర్షయస్తథా |
అనిత్యమసుఖం లోకమ్‌
ఇమం ప్రాప్య భజస్వ మామ్‌ ||

తాత్పర్యము : ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గూర్చియు, భక్తుల గూర్చియు, రాజర్షుల గూర్చియు వేరుగా చెప్పవలెనా! అందుచే అనిత్యమును, అసుఖమును అగు ఈ లోకమునకు వచ్చి యున్నందున నా ప్రమయుక్తసేవలో నియుక్తుడవగుము.

భాష్యము : ఈ ప్ర పంచము దు:ఖ భరితము మరియు అశాశ్వతమని శ్రీకృష్ణుడు నిర్ధారించి యున్నాడు. అయితే కొందరు తత్త్వవాదులు ఈ ప్రపంచము మిధ్యా అని పలుకుచూ ఉందురు. కానీ భగవద్గీత ప్రకారము ఈ ప్రపంచము అశాశ్వతము కానీ మిథ్య కాదు. మిథ్య అనడానికి, అశాశ్వతము అనడానికి చాలా తేడా ఉన్నది. ఈ ప్రపంచము దు:ఖ భరితము కానీ ఆనందమయమైన వేరొక ప్రపంచము ఉన్నది. కాబట్టి మనము దు:ఖ భరితమైన ఈ ప్రపంచములోనే ఉండిపోవలసిన అవసరము లేదు. భగవంతుని పాద పద్మములను ఆశ్రయించి శాశ్వత ఆనందరము పొందవచ్చును. కేవలము భక్తి ద్వారా మాత్రమే అందరి సమస్యలూ పరిష్కరింపబడగలవు. కాబట్టి అందరూ కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకుని జీవితాన్ని సార్ధకము చేసుకొనవచ్చును.

Advertisement

తాజా వార్తలు

Advertisement