అధ్యాయం 9, శ్లోకం 31
క్షిప్రం భవతి ధర్మాత్మా
శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి |
కౌంతేయ ప్రతి జానీహి
న మే భక్త: ప్రణశ్యతి ||
తాత్పర్యము : అతడు శ్రీఘ్రమే ధర్మాత్ముడై శాశ ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయా! నా భక్తుడైన్నడును నశింపడని ధైర్యముగా ప్రకటింపుము.
భాష్యము : శ్రీమద్భాగవతములో ఒక శుద్ధ భక్తునికి అన్ని సద్గుణాలు ఉంటాయని తెలియజేయబడినది. అలాంటప్పుడు అతడు అకస్మాత్తుగా లేక ఉద్దేశ్యపూర్వకముగా పతనము అయినప్పుడు శుద్ధ భక్తుడు ఎట్లు కాగలుగుతాడు అని ప్రశ్నించవచ్చును. శుద్ధ భక్తుని హృదయములో భగవంతుడు ఉండుటవలన సహజముగానే అతని హృదయములోని పాపపు ప్రవృత్తి ప్రక్షాళన చేయబడి వెంటనే తిరిగి పవిత్రుడు అవుతాడు. భగవంతుణ్ని సదా స్మరించే భక్తుడు ప్రాయశ్చిత్తముగా వరొకటి ఏదీ చేయవలసిన అవసరము లేదు. కాబట్టి నిరంతరము ”హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే” అనే మహా మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇది అన్ని ఆకస్మిక పొరపాట్ల నుండి కాపాడుతుంది. ఇలా చేయుట వలన ఏ భౌతిక కల్మషము అంటకుండా ఎల్లప్పుడు ముక్తుడుగా ఉండగలుగుతాడు.