Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)


అధ్యాయం 9, శ్లోకం 28

28.
శుభాశుభఫలైరేవం
మోక్షస్యే కర్మబంధనై: |
సన్న్యాసయోగయుక్తాత్మా
విముక్తో మాముపైష్యసి ||

తాత్పర్యము : ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి మరియు వాని శుభాశుభఫలముల నుండి ముక్తుడవు కాగలవు. ఇట్టి సన్యాసయోగముతో నాయందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై పొందగలవు.

భాష్యము : మనము ఈ భౌతిక ప్రపంచములో జీవిస్తూ ఉన్నంతకాలమూ మనము ఏదో ఒక కార్యము చేస్తూనే ఉండాలి. మనము పూర్తిగా అన్ని కార్యాలు మానివేయలేము. కాబట్టి గొప్ప సాధువులైన శ్రీల రూపగోస్వామి ఇలా సూచిస్తూ ఉన్నారు. మనము కార్యాలను చేసి వాటి ఫలితాలను శ్రీ కృష్ణునికి సమర్పించినట్లయితే అది ‘యుక్త-వైరాగ్య ‘ మనబడుతుంది. ‘యుక్త’ అనగా ఉన్నత భక్తుల మార్గ దర్శకత్వములో కృష్ణుని కోసము కార్యములను చేయుట. నిజానికి వైరాగ్యముతో చేయు అట్టి కార్యములు భక్తుని హృదయాన్ని పరిశుభ్రము కావించి అతడు క్రమేణ పురోగతి చివరకు భగవంతుణ్ని పూర్తిగా శరణు పొందునట్లు చేయును. జీవించి ఉన్నప్పుడు ఇటువంటి సాధన చేసినట్లయితే అతడు మరణానంతరము భగవద్ధమమునకు వెళ్ళి ప్రత్యక్షముగా భగవంతుణ్ని సేవించే అవకాశాన్ని పొందుతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement