అధ్యాయం 9, శ్లోకం 27
27.
యత్కరోషి యదశ్నాసి
యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌంతేయ
త త్కురుష్వ మదర్పణమ్ ||
తాత్పర్యము : ఓ కౌంతేయా! నీవు ఏది ఒనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగినను, ఏ తపస్సు నాచరించినను వాటన్నింటిని నాకు అర్పణముగా ఒనరింపుము.
భాష్యము : ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యమేమిటంటే ఏ సందర్భములోనూ కృష్ణున్ని మరచి పోకుండా ఉండేటట్లు జీవితాన్ని మలచు కొనవలెను. ప్రతి ఒక్కరూ తమ శరీర పోషనకై కొంత పని చేయవలసి ఉంటుంది. దానికి కృష్ణుడు, నా కోసం పని చేయండి అని సూచించుచున్నాడు. ప్రతి ఒక్కరూ ఆహారాన్ని భుజింవలసి ఉంటుంది. కాబట్టి కృష్ణునికి అర్పించిన ఆహారాన్ని స్వీకరించవలెను. నాగరిక మానవునిగా మనము కొన్ని పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాము. కృష్ణుడు, ‘వాటిని నాకు చేయండి’ అని సూచిస్తూ ఉన్నాడు. ప్రస్తుతము అందరూ ‘మెడి టేషన్’ చేస్తూ ఉన్నారు. అయితే హరే కృష్ణ మంత్ర జపాన్ని చేయవచ్చును. ఇలా 24గంటలూ భగవంతుణ్ని ధ్యానిస్తూ ఆరవ అధ్యాయములో తెలుపబడినట్లు అత్యుత్తమ యోగి కావచ్చును.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..