Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 9, శ్లోకం 26

26.
పత్రం పుష్పం ఫలం తోయం
యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృతమ్‌
అశ్నామి ప్రయతాత్మన: ||

తాత్పర్యము : పత్రమునైనను, పుష్పమునైనను, ఫలమునైను లేదా జలమునైను ప్రేమతోను, భక్తితోను ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతును.

భాష్యము : శ్రీ కృష్ణుడు ఈ శ్లోకములో వాస్తవానికి తానే ఏకైక భోక్తనని, దేవాది దేవుడని అన్నియునూ అర్పించవలసినది తనకేనని ప్రకటించుచున్నాడు. అంతే కాక తనకు ఎమేమి అర్పించ్చునో కూడా సూచించు చున్నాడు. నిజమైన భక్తుడు, భగవంతుని ఏది ఇష్టమో తెలుసుకొని దానినే అర్పించటానికి ప్రయత్నిస్తాడు. ఈ శ్లోకములో తనకు నచ్చినవాటిని భగవంతుడు స్పష్టముగా తెలియజేయుచున్నాడు. అనగా మాంసము, కోడిగ్రుడ్లు, చేపలు వంటి వాటిని కృష్ణునికి అర్పించ కూడదు. వాటిని భిన్నముగా ఆకుగాని, ఫలముగాని, పుష్పముగాని, నీరు గాని మనము అర్పించవచ్చును. అటువంటి యజ్ఞము, భక్తితో ఎదగాలనుకునే భక్తుని హృదయాన్ని పవిత్రీ కరిస్తుంది. అయితే వంట చేసేటప్పుడు, భగవంతునికి అర్పించేటప్పుడు, ఆ ప్రసాదాన్ని వితరణ చేసేటప్పుడు ముఖ్యమైన అంశము, శ్రీ కృష్ణుని పట్ల ప్రేమతో ఈ కార్యాలన్నీ చేయుట. ఎవరైతే పరబ్రహ్మము నిరాకారము, ఇంద్రియములు లేవు అని భావించేవారు ఈ భగవద్గీతా శ్లోకాన్ని అర్ధము చేసుకొనలేరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement