Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 9, శ్లోకం 24

24.
అహం హి సర్వయజ్ఞానాం
భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామ భిజానంతి
తత్త్వేనాతశ్చ్యవంతి తే ||

తాత్పర్యము : నేనే సర్వ యజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయియున్నాను. కావున నా వాస్తవమైన దివ్యస్వభావమును గుర్తింపలేనివారు పతనము చెందుదురు.

భాష్యము : వేదాలలో తెలుపబడిన సర్వ యజ్ఞాలకు భోక్త విష్ణువే. యజ్ఞ అనగా విష్ణువు. మూడవ అధ్యాయములో కూడా ఇదే విషయము నిర్ధారింపబడినది. మానవ జీవన సోపానమైన వర్ణాశ్రమ ధర ్మములు కూడా విష్ణువు ప్రీత్యర్ధమే ఉద్ధేశించబడినవి. అయితే తెలివి తక్కువ జనులు ఈ విషయమును గుర్తించక త్వరిత ఫలితముకై వేరు వేరు దేవతలను ఆశ్రయించుదురు. అందుకారణముగా వారు ఈ భౌతిక సంసారములో పడిపోయి అంతిమ ల క్ష్యాన్ని సాధించలేకపోవుచున్నారు. కాబట్టి భౌతిక కోరికలున్నప్పటికీ భగవంతుణ్ని ఆశ్రయించుటే మేలు. అది ఉత్తమ భక్తి కాక పోయినా క్రమేణ లక్ష్మాన్ని చేరుకునే అవకాశాన్ని పొందుతారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement