Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)


అధ్యాయం 9, శ్లోకం 23

23.
యేప్యన్యదేవతా భక్తా
యజంతే శ్రద్ధయాన్వితా: |
తే పి మామేవ కౌంతేయ
యజంత్యవిధిపూర్వకమ్‌ ||

తాత్పర్యము : ఓం కౌంతేయా! అన్యదేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించు చున్నారు.

భాష్యము : మనము చెట్టు మూలమును నీరు పోయక కొమ్మలకు, రెమ్మలకూ నీరు పోసినట్లయితే అది తెలివితక్కువ తనము అవుతుంది. అలాగే భగవంతుణ్ని పూజింపక ఆయన గవర్నమెంటులో వివిధ కార్యాలను నిర్వర్తించు దేవతలను పూజించుటయూ తెలివి తక్కువ తనమే అనబడుతుంది. అది కూడా ఒక రకముగా భగవంతుణ్న పూజించినట్లు అయినా దానిని ఇక్కడ భగవంతుడు సమర్ధించక పోగా ‘ అవిధిపూర్వకము’ అని నిరసిస్తూ ఉన్నాడు. ఇంకొక రకముగా చెప్పవలెనన్న కృష్ణున్ని చేరుటకు అది సరైన మార్గము కాదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement