అధ్యాయం 9, శ్లోకం 20
20.
త్రైవిద్యా మాం సోమపా: పూతపాపా
యజ్ఞైర్విష్ట్వా స్వర్గతిం పార్థయంతే |
తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమ్
అశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్ ||
తాత ్పర్యము : స్వర్గలోకములను గోరుచు వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే అర్చింతురు. పాపఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్య ఇంద్రలోకమున జన్మించి దేవభోగముల ననుభవింతురు.
భాష్యము : మూడు వేదాలను చదివిన బ్రాహ్మణున్ని త్రివేది అందురు. అయితే వాటి లక్ష్మమైన భగవద్భక్తిని స్వీకరించకుండా కేవలము ఉన్నత భౌతిక ఆనందమునకే పాటుబడినట్లయితే కృష్ణుని ్న చేరుకోలేరు. దురదృష్టవశాత్తు వారు దేవతలను పూజిస్తూ స్వర్గలోకాలకు వెళ్ళి ఆనందించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ శ్లోకమునందు తెలిపినట్లు కృష్ణుడ్ని లక్ష్మముగా వేదాలను పఠించవలసి ఉన్నది. మరొక రకముగా చెప్పవలెనన్న వారు హరే కృష్ణ మంత్రముతో భగవంతున్ని పూజిస్తూ, భగవ ద్గీతను పఠిస్తూ కృష్ణ తత్త్వాన్ని అర్ధము చేసుకున్నచో, వారి వేదాధ్యయనము సఫలీకృతము అయినట్లు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..