Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)


అధ్యాయం 9, శ్లోకం 19

19.
తపామ్యహమహం వర్షం
నిగృహ్ణాముత్సృజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ
సదసచ్చాహమర్జున ||

తాత్పర్యము : ఓ అర్జునా! వేడినొసగువాడను, వర్షమును నిరోధించుట మరియు కురిపించట చేయువాడను నేనే. అమృతత్వమును మరియు మృత్యువును నేనే. సత్‌, అసత్తులు రెండునూ నా యందే యున్నవి.

భాష్యము : శ్రీ కృష్ణుడు తన వేరు వేరు శక్తులు ద్వారా వివిధ కార్యాలను నిర్వహిస్తూ ఉంటాడు. సూర్యుని ద్వారా వేడిమినిస్తూ ఉంటాడు. వర్షాన్ని నియంత్రిస్తూ ఉంటాడు, అలాగే జీవులకు జీవనాన్ని, మరణాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఈ విధముగా వేరు వేరు శక్తుల కార్యాల వెనుక భగవంతుడ్ని చూడటం ద్వారా మనము భౌతికము ఆధ్యాత్మికము యొక్క సమానత్వాన్ని చూడగలుగుతాము. కాబట్టి కృష్ణ చైతన్యములో ఎదిగిన వ్యక్తి అన్ని అంశాలలో కృష్ణుని పాత్రను గుర్తించి కృష్ణుని స్మరించుట చేత ఆధ్యాత్మిక, భౌతిక కార్యాల నడుమ గల భేధమును అధిగమించును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement