అధ్యాయం 9, శ్లోకం 16
16.
అహం క్రతురహం యజ్ఞ:
స్వధాహమమహమౌషధమ్ |
మంత్రోహమహమేవాజ్యమ్
అహమగ్నిరహం హుతమ్ ||
తాత్పర్యము : నేనే క్రతువును, యజ్ఞమును, పూర్వులు కొసగబడు ఆహుతిని, ఔషధమును, దివ్యమంత్రమును అయి యున్నాను. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే.
భాష్యము : వైదిక యజ్ఞాలలో వాడే ప్రతీది శ్రీ కృష్ణుడు శక్తి మాత్రమే. మంత్రాలు గాని, అగ్నిగాని, వివిధ వస్తువులు గాని, భగవంతుని శక్తుల నుండి వచ్చినవే కాబట్టి అవి భగవంతుడి కంటే భిన్నము కాదు. అలాగే పితృలోకవాసులకు అర్పించే తర్పణము వెన్నతో చేయబడుతుంది. అది కూడా కృష్ణునిలో భాగమే. అందుచేత ఎవరైతే కృష్ణున్ని పూజిస్తూ ఉంటారో వారు వేదాలలో తెలిపిన యజ్ఞ యాగాదులన్నింటినీ చేసిన వారగుదురు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..