Saturday, November 23, 2024

గీతాసారం (ఆడియోతో…)


అధ్యాయం 9, శ్లోకం 15

15.
జ్ఞానయజ్ఞేన చాప్యన్యే
యజంతో మాముపాసతే |
ఏకత్వేన పృథక్త్వేన
బహుధా విశ్వతోముఖమ్‌ ||

తాత్పర్యము : జ్ఞాన సముపార్జన యజ్ఞము నందు నియుక్తులైన ఇతరులు దేవదేవుడనైన నన్ను అద్వితీయునిగా, వివిధ రూపునిగా, విశ్వరూపునిగా పూజింతురు.

భాష్యము. శ్రీ కృష్ణున్ని పూజించే భక్తులను మూడు తరగతులుగా విభజింపవచ్చును. మొదటి తరగతి వారు మహాత్ములు. నిస్వార్ధముగా సదా సేవా భావముతో శ్రీ కృష్ణున్ని పూజించేవారు. రెండవ తరగతి వారు కష్టాలు తీరటానికి, సంపదల కోసము, జిజ్ఞాసతోనూ, జ్ఞాన సముపార్ణన కోసమూ కృష్ణున్ని పూజించే పుణ్యాత్మలు. ఇక మూడవ తరగతి వారు తామే భగవంతులమని భావించి తమను తాము పూజించుకొనువారు, దేవతా రూపాలనే భగవంతుడని పూజించేవారు మరియు విశ్వరూపాన్ని పూజించేవారు. ఈ మూడు తరగతులలో ఎక్కువ మంది నిరాకారులే! వారు అందరిలోనూ తక్కువ స్థాయికి చెందినవారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement