Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)


అధ్యాయం 9, శ్లోకం 13

13.
మహాత్మానస్తు మాం పార్థ
దైవీం ప్రకృతిమాశ్రితా: |
భజంత్యనన్యమనసో
జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్‌ ||

తాత్పర్యము : ఓ పృథకుమారా! భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీప్రకృతిని ఆశ్రయించి యుందురు. వారు నన్ను ఆదియును, అవ్యయుడును అగు దేవదేవునిగా ఎరిగి యుండుటచే నా భక్తియుత సేవలో సంపూర్తముగా నిమగ్నులై ఉందురు.

భాష్యము : ఈ శ్లోకమునందు నిజమైన ‘మహాత్ముడు’ ఎవరో చక ్కగా వివరించబడినది. శ్రీ కృష్ణుడు దేవాది దేవుడని తెలిసికొని ఆయనను పూర్తిగా శరణు పొందువారు, ఈ భౌతిక ప్రకృతి యొక్క నియమాలకు అతీతులై ముక్తిని పొందుదురు. అటువంటి జీవులు ఆధ్యాత్మిక ప్రకృతి అధీనములోనికి వచ్చుదురు. అప్పుడు ‘శ్రీ కృష్ణుని ఏవిధముగా సేవిద్దామనే’ ఆకాంక్ష సదా వారిని నడిపిస్తూ ఉంటుంది. అటువంటి వారు ‘మహాత్ముడు’ అని పిలువబడుదురు. శుద్ధ భక్తులు లేదా ఇతర మహాత్ముల సాంగత్యము వలననే ఏదేని వ్యకి ్త అట్టి ‘మహాత్ముడు’ కాగలడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement