అధ్యాయం 9, శ్లోకం 7
7.
సర ్వభూతాని కౌంతేయ
ప్రకృతిం యాంతి మామికామ్ |
కల్పక్షయే పునస్తాని
కల్పాదౌ విసృజామ్యహమ్ ||
తాత్పర్యము : ఓ కౌంతేయ! కల్పాంతమున సమస్త భౌతిక సృష్టులు నా ప్రకృతియందు ప్రవేశించును. తదుపరి కల్పారంభమున నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజింతును.
భాష్యము : భగవంతుడు ఏ విధముగా ఈ సృష్టిని సృష్టించి, దానిని తిరిగి నశింపచేయునో ఇచ్చట వివరించ డమైనది. బ్రహ్మ యొక్క వంద సంవత్సరముల పిమ్మట ఈ దృశ్యమాన జగత్తు నశింపబడును. అయితే ఆయన ఒక రోజు 860కోట్ల మానవ సంవత్సరములు. అలా ఆయన జీవిత కాలాంతమున ఈ జగత్తు భగవంతుని యందు ప్రవేశించును. అట్లే మరలా అవసరము వచ్చినప్పుడు తిరిగి భగవంతుని నుండి సృష్టి ప్రారంభమగును.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..