అధ్యాయం 9, శ్లోకం 6
6.
యథాకాశస్థితో నిత్యం
వాయు: సర్వత్రగో మహాన్ |
తథా సర్వాణి భూతాని
మత్స్థానీత్యుపధారయ ||
తాత్పర్యము : సర్వత్రా వీచునట్టి ప్రచండ వాయువు సదా అవకాశము నందే స్థితిని కలిగియుండునట్లు, సృజింపబడిన సమస్ జీవులు నాయందు స్థితిని కలిగియున్నవని గ్రహింపుము.
భాష్యము : సామాన్య మానవునికి సైతమూ అర్థమయ్యేందుకు ఇక్కడ భగవంతుడు ఒక ఉదాహరణను ఇచ్చుచున్నాడు. వాయువు ఎంతో శక్తివంతమైనది. అది అన్నింటి యొక్క గమనానికీ కారణము. అయితే అంతటి వాయువు కూడా ఆకాశముచే నియంత్రించబడుచున్నది. ఆకాశమును దాటి వాయువు విస్తరించలేదు. అదే విధముగా భౌతిక సృష్టి భగవంతుని ఆజ్ఞపై ఆధారపడి ఉంటుంది. భగవంతుని ఆజ్ఞ లేనిదే గడ్డిపోచ కూడా కదలదు. మనకు అత్యంత అద్భుతముగాను, మహోన్నతముగాను కనిపించే ఈ భౌతిక జగత్తు భగవంతుని సంపూర్ణ నియంత్రణలోనే ఉంటుందని వేదాలు సైతమూ పేర్కొనుచున్నవి.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..