Friday, November 22, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 9, శ్లోకం 2

2.
రాజవిద్యా రాజగుహ్యం
పవిత్రమిదముత్తమమ్‌ |
ప్రత్యక్షావగమనం ధర్మ్యం
సుసుఖం కర్తుమవ్యయమ్‌ ||

తాత్పర్యము : ఈ జ్ఞానము విద్యల లోకెల్ల రాజు వంటిది మరియు సర్వ రహస్యములలో పరమ రహస్యమైనది. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగజేయుటచే ధర్మము యొక్క పూర్ణత్వమైయున్నది. ఇది శాశ్వతమైనదే కాక ఆచరించుటకు అత్యంత సులభకరమైనది.

భాష్యము : ఈ శ్లోకము నందు శ్రీకృష్ణుడు తన పట్ల భక్తిసేవా భావన కలిగియుండుటయే జీవిత పరమార్ధమని, ఎటువంటి అర్హతలు అవసరము లేదని తెలియజేయుచున్నాడు. మనకు ఒక శుద్ధ భక్తులన్ని సేవించి, ఆయన నుండి శ్రవణము చేసే మహాద్భాగ్యము కలిగినంతనే మార్గము సుగమము కాగలదు. తద్వారా ప్రారబ్ధ, అప్రారబ్ధ పాపముల నుండి విముక్తులమై , వేదములలో తెలిపిన పుణ్యకార్యముల ఫలితములన్నింటిని పొందగలుగుదురు. ఈ సులభ మార్గమును, పిల్లలు, అనాగరికులు, వృద్ధాప్యులు సైతము ఆనందముగా పాటించగలుగుదురు. ముక్తి పొందిన పిదప కూడా భగవద్రాజ్యములోనూ భక్తిని శాశ్వతముగా పాటించవచ్చును. కాబట్టి నిస్సంకోచముగా ప్రతి ఒక్కరూ ఈ రాజవిద్యను స్వీకరించవచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement