Thursday, November 21, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 9, శ్లోకం 1
ఓం శ్రీ పరమాత్మనే నమ:

అథ నవమోధ్యాయ:
రాజవిద్యారాజగుహ్యయోగ:

1.
శ్రీభగవాన్‌ ఉవాచ
ఇదం తు తే గుహ్యతమం
ప్రవక్ష్యామ్యనసూయవే |
జ్ఞానం విజ్ఞానసహితం
యద్‌జ్ఞాత్వా మోక్ష్యసే ||

తాత్పర్యము : శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ అర్జునా! నీవు నా యెడ ఎన్నడును అసూయ కలవాడవు కానందున ఈ గుహ్యతమజ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసెదను. దీనిని తెలిసిన పిమ్మట భౌతికస్థితి వలన కలిగెడి క్లేశముల నుండి నీవు ముక్తుడవు కాగలవు.

భాష్యము : భక్తుల సాంగత్యములో శ్రీకృష్ణుని గురించి వినుట, చర్చించుట అనే ప్రక్రియలు చాలా ప్రభావమేను కలిగి ఆధ్యాత్మిక అవగాహనలో ముందుకు నడచుటకు తప్పక ఉపయోగబడతాయి. ఈ కారణముగానే, ఈ అధ్యాయములో శ్రీకృష్ణుడు గుహ్యతమ జ్ఞానమైన శుద్ధ భక్తి యొక్క గొప్పతనాన్ని మరియు తన వైభవములను అర్జునునికి వివరించబోవుచున్నాడు. అసూయ లేనటువంటి అర్జునుని వంటి భక్తులు మాత్రమే ఈ జ్ఞనాన్ని గ్రహించగలరు. కాబట్టి భగవద్గీత పెక్కు వ్యాఖ్యానాలను రచిస్తున్న గొప్ప పండితులు సైతమూ అసూయ వలన ఈ జ్ఞానానికి పాత్రులు కారు, అందుచేత వారి వ్యాఖ్యానాలు నిరుపయోగములే కాగలవు. నవ విధ భక్తిమార్గములు : శ్రవణము, కీర్తనము, స్మరణము, వందనము, సేవనము, చెప్పిన కార్యములు శిరసావహించుట, పూజనము మరియు ఆత్మనివేదనము. ఎప్పుడైతే భక్తుల సాంగత్యములో అసూయా భావన లేకుండా వీటిని పాటించుదురో వారి హృదయము అన్ని కల్మషాల నుండి ప్రక్షాళన చేయబడి శ్రీకృష్ణతత్త్వాన్ని అర్థము చేసుకొనుట సాధ్యమవుతుంది. అప్పుడు అటువంటి భక్తుడు ఈ భౌతిక ప్రపంచము నందు క్లేశముల నుండి ముక్తడవుతాడు.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..
——————————-

Advertisement

తాజా వార్తలు

Advertisement