అధ్యాయం 8, శ్లోకం 26
26.
శుక్లకృష్ణే గతీ హ్యేతే
జగత: శాశ్వతే మతే |
ఏకయా యాత్యనావృత్తిమ్
అన్యయావర్తతే పున: ||
తాత్పర్యము : ఈ జగత్తు వీడుటకు వేదాభిప్రాయము ననుసరించి శుక్ల, కృష్ణపక్షములనెడి రెండు మార్గములు కలవు. శుక్లమార్గము నందు మరణించువాడు తిరిగిరాకుండును. కాని చీకటిమార్గమున మరణించువాడు మాత్రము వెనుకకు తిరిగి వచ్చును.
భాష్యము : ఎవరైతే ఫలాసక్తితో కర్మలు చేస్తూ ఉందురో, తర్క జ్ఞానాన్ని ఉపాసించుదురో వారు అనాదిగా వస్తూ పోతూ ఉంటారే తప్ప ముక్తిని పొందరు. నిజానికి శ్రీకృష్ణుని ఆశ్రయించనిదే ముక్తి సాధ్యము కాదు. దనీని చాందోగ్య ఉపనిషత్తు (5.10.3-5) ఆధారముగా ఆచార్య బలదేవ విద్యాభూషణులు నిరూపించినారు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..