Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 25

25.
ధూమో రాత్రిస్తథా కృష్ణ:
షణ్మాసా దక్షిణాయనమ్‌ |
తత్ర చాంద్రమసం జ్యోతి :
యోగీ ప్రాప్య నివర్తతే ||

తాత్పర్యము : ధూమమునందు, రాత్రియందు, కృష్ణపక్షమందు, సూర్యుడు దక్షిణముగా ప్రయాణించు దక్షిణాయన సమయమునందు మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరల వెనుకకు తిరిగివచ్చును.

భాష్యము : మనకు శ్రీమద్భాగవతము మూడవ స్కందము నందు కపిల భగవానుడు చంద్రమండలము గురించి అనేక వివరాలనను తెలియజేసినాడు. ఎవరైతే కర్మకాండలు, యజ్ఞములను దక్షతతో నిర్వహిస్తారో, వారు మాత్రమే చంద్ర లోకాన్ని చేరుకుంటారని, అక్కడవారు పదివేల సంవత్సరములు జీవిస్తారని చివరకు తిరిగి ఈ భూమిపై జన్మిస్తారని వివరించబడినది. దీనిని బట్టి చంద్రలోకములో ఉన్నత జీవులు ఉన్నారని వారు మన భౌతిక ఇంద్రియాలకు గోచరించరని అర్ధము అవుతుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement