Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 33

33
శ్రేయాన్‌ ద్రవ్యమయాద్యజ్ఞాత్‌
జ్ఞానయజ్ఞ: పరంతప |
సర్వం కర్మాఖిలం పార్థ
జ్ఞానే పరిసమాప్యతే ||

తాత్పర్యము : ఓ పరంతపా ! జ్ఞానయజ్ఞము ద్రవ్యమయయజ్ఞము కన్నను మహత్తరమైనది. ఓ పార్థా! కర్మ యజ్ఞములన్నియును చివరికి దివ్యజ్ఞానమునందే పరిసమాప్తినొందును.

భాష్యము : అన్ని విధములైన యజ్ఞముల లక్ష్యము, జ్ఞానవంతులమై భౌతిక కష్టాల నుండి బయటపడి చివరకు భగవద్భక్తి చేయుటయే. మనము యజ్ఞములను భౌతిక సంపదల దానధర్మాల వరకే చేస్తూ దివ్య జ్ఞానము కోసము ఉద్ధేశించమో అప్పటివరకూ అవి భౌతిక కార్యాలు గానే మిగిలిపోతాయి. దివ్యజ్ఞాన లక్ష్యము లేనిదే ఆధ్యాత్మిక ఫలితాలు రావు. మన శ్రద్ధ, విశ్వాసము ఉన్నతి చెంది దివ్యజ్ఞానమును లక్ష్యంగా చేస్తామో అప్పుడు దానికి సంబంధించిన కార్యాలన్నీ ఆధ్యాత్మికమవుతాయి. అటువ ంటి వ్యక్తి కేవలము కామ్య కర్మల ” కర్మ కాండను”ను దాటి, జ్ఞాన లక్ష్యమైన ” జ్ఞాన కాండ” స్థితికి ఎదుగుతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement