Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 23

23.
యత్ర కాలే త్వనావృత్తిమ్‌
ఆవృత్తిం చైవ యోగిన: |
ప్రయాతా యాంతి తం కాలం
వక్ష్యామి భరతర్షభ ||

తాత్పర్యము : ఓ భరతవంశ శ్రేష్ఠుడా! ఏయే కాల మందు ఈ జగమును వీడుట ద్వారా యోగి వెనుకకు తిరిగి వచ్చుట జరుగునో లేక తిరిగి రాకుండునో నీకు నేనిప్పుడు వివరించెదను.

భాష్యము : భగవంతుని శుద్ధ భక్తులు, భగవంతుని శరణు జొచ్చుటచే వారు శరీరమును ఏ సమయములో ఏ పరిస్థితులలో వదలిపె ట్టవలెననోయని అంతగా పట్టించుకోరు. వారు ఆ నిర్ణయాన్ని శ్రీకృష్ణునికే వదిలివేసి భగవద్దామాన్ని చేరుకుందురు. అయితే అలా శుద్ధభక్తిని కాక, కర్మయోగమో, జ్ఞానయోగమో లేదా హఠయోగమో పాటించు వారు శరీరాన్ని ఏ సమయములో వదులుతారనే దానిపై మరలా ఈ జన్మమృత్యు ప్రపంచానికి తిరిగి వస్తారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. యోగాభ్యాసము పరిపూర్ణము గావించిన యోగి తాను ఏ సమయములో శరీరాన్ని వదలాలనుకుంటున్నాడో నిర్ణయించుకోవచ్చును. కాని ఆ స్థితికి చేరని యోగి ఏ క్షణాన్నైనా శరీ రాన్ని వదలాల్సి రావచ్చు. ఇక్కడ ‘కాలము’ అనే పదము కాల దేవతను సూచిస్తుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement