Thursday, November 21, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 20
20.
పరస్తస్మాత్తు భావోన్యో
వ్యక్తో వ్యక్తాత్‌ సనాతన: |
య: స సర్వేషు భూతేషు
నశ్యత్సు న వినశ్యతి ||

తాత్పర్యము : వ్యక్తావ్యక్తములయ్యెడి ఈ భౌతిక ప్రకృతి కన్ననను పరమైనదియు, శాశ్వతమైనదియు అగు అవ్యక్త ప్రకృతి వేరొక్కటి కలదు. అది పరమోత్కృష్ణమును, నాశరహితమును అయియున్నది. ఈ జగము నందు గల సమస్తము నశించినను అది మాత్రము యథాతథముగా నిలిచియుండును.

భాష్యము : శ్రీకృష్ణుని ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి దివ్యమైనది మరియు శాశ్వతమైనది ఈ భౌతిక శక్తి యొక్క మార్పుచేర్పులకు అతీతమైనది. భౌతిక శక్తి బ్రహ్మ యొక్క రాత్రి సమయములో నశింపజేయబడి, పగలు సమయములో తిరిగి సృష్టించబడుతుంది. అయితే ఆధ్యాత్మిక శక్తి దానికి విరుద్ధముగా దివ్యమైన శాశ్వతమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది. భగవంతుని ఉన్నత, నిమ్న శక్తులను గురించి గడచిన అధ్యాయములో మనము చర్చించుకున్నాము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement