Tuesday, November 26, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 16
16.
ఆబ్రహ్మభువనాల్లోకా:
పునరావర్తినోర్జున |
మాముపేత్యు తు కౌంతేయ
పునర్జన ్మ న విద్యతే ||

తాత్పర్యము : భౌతిక జగమునందలి అత్యున్నతలోకము మొదలుకొని అధమలోకము వరకు గల సర్వలోకములు జన్మమృత్యుభరితమైన దు:ఖప్రదేశములే. కాని ఓ కౌంతేయా! నా లోకమును చేరినవాడు తిరిగి జన్మము నొందడు.

భాష్యము : ఎటువంటి యోగి అయిన (కర్మ, జ్ఞాన లేదా హఠ) యోగి అయిన చివరకు భక్తి యోగము ద్వారా కృష్ణలోకమునకు చేరనిదే తిరిగి వచ్చే అవకాశము ఉంటుంది. భూలోకమున పుణ్యము చేసిన వారు స్వర్గానికేగుదురు. ఆ పుణ్యము నశించిన తిరిగి వచ్చుదురు. అలాగే ఇంద్ర చంద్రాది లోకములకే గాక బ్రహ్మలోకమునకు వెళ్ళినా తిరుగువచ్చు అవకాశము ఉన్నది. అనగా పునరపి జననం పునరపి మరణం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఉన్నతలోకములలో భక్తి కొనసాగించినవారు మాత్రమే ప్రళయానంతరము భగవద్ధామము వెళ్లే అవకాశము పొందుదురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement