Friday, November 22, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 14

14.
అనన్యచేతా: సతతం
యో మాం స్మరతి నిత్యశ: |
తస్యాహం సులభ: పార్థ
నిత్యయుక్తస్య యోగిన : ||

తాత్పర్యము : ఓ పార్థా! అనన్యచిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుతసేవ కారణమున నేను సులభముగా లభ్యుడనై యున్నాను.

భాష్యము : ఈ శ్లోకము భక్తి యోగము ద్వారా భగవంతుణ్ని సేవించు శుద్ధ భక్తుల యొక్క గమ్యము ప్రత్యేకముగా వివరించబడినది. ఇంతకు ముందు శ్లోకాలలో వేరు వేర్వేరు భక్తులు, వేర్వేరు ముక్తిమార్గాలైన కర్మయోగము, జ్ఞానయోగము మరియు హఠయోగము వివరింపబడినవి. ఇటువంటి యోగాపద్ధతులలో కొంత భక్తి జతపరచబడినది అయితే ఈ శ్లోకము కర్మ, జ్ఞాన, యోగ మిశ్రి తము కాని శుద్ధ భక్తి – యోగము ప్రస్తావించబడినది. ఒక శుద్ద భక్తుడు, నిష్కామి. ఆయన స్వర్గలోకాలు గాని, బ్రహ్మజ్యోతిలో లీనమగుటను గాని, భౌతిక బంధన విముక్తి గానీ కోరుకోడు. నిస్వార్థముగా, శాంతముతో భగవంతుని ప్రసన్నతను తప్ప మరేదానినీ కోరడు. కాబట్టి అటువంటి భక్తునికి తాను సులభముగా సాధ్యమగునని తెలియజేయుచున్నాడు. భక్తి యోగము హరే కృష్ణమంత్ర ఉచ్చారణతో ఎంతో సులభముగా మొదలుపెట్టవచ్చును. భగవంతుడు అందరి పట్ల కరుణతో ఉండును. ప్రత్యేకించి తన భక్తులకు తనను చేరుకునే తెలివితేటలను ప్రసాదించును. ఈ విధముగా భగవతుణ్ని ‘సతతమూ’ ‘నిత్యమూ’ స్మరించు భక్తుడ్ని, భగవంతుడు క్షణము కూడా మరచి ఉండడు. ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే ‘ అను మంత్రము ఉచ్చరించు వారికి ఇదే భగవంతుడు ఇచ్చు ప్రత్యేక వరము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement