అధ్యాయం 8, శ్లోకం 12
12.
సర్వద్వారాణి సంయమ్య
మనో హృది నిరుధ్య చ |
మూర్ధ్న్యాధాయాత్మన: ప్రాణమ్
ఆస్థితో యోగధారణామ్ ||
తాత్పర్యము : ఇంద్రియ కర్మల నుండి విడివడియుండుటయే యోగస్థితి యనబడును. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి, మనస్సును హృదయము నందు స్థిరము చేసి, ప్రాణవాయువును శ్రీర్షాగ్రమునందు నిలిపి మనుజుడు యోగమునందు స్థితుడు కాగలడు.
భాష్యము : ఇక్కడ చెప్పిన యోగపద్ధతిని పాటించవలెనన్న మొట్టమొదట అన్ని రకాల ఇంద్రియ భోగాలకు దారులను మూసివేయవలసి ఉన్నది. దీనినే ప్రత్యాహారము అని అందురు. అనగా ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి దూరము చేయుట. జ్ఞానేంద్రియాలైన కళ్లు, చెవులు, ముక్కు, నాలుక మరియు స్పర్శను పూర్తిగా నిగ్రహించి, స్వీయ తృప్తికి ఉపయోగించకుండా కట్టడి చేయవలెను. ఈవిధముగా ఆరవ అధ్యాయంలో వివరించినట్లు మనస్సును హృదయములోని పరమాత్మపై నిలపి, ప్రాణవాయువును శిరస్సుకు ఉద్దరింపవలెను. మనము ఇంతకు ముందే చర్చించినట్లు ఇటువంటి యోగాభ్యాసము నేడు దుస్సాధ్యము కావున కృష్ణ భక్తి ద్వారా మనస్సును కృష్ణునిపై లగ్నము చేసినట్లయితే సమాధి సులభ సాధ్యము కాగలదు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..