Sunday, November 17, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 7

7.
తస్మాత్‌ సర్వేషు కాలేషు
మామనుస్మర యుధ్య చ |
మయ్యర్పితమనోబుద్ధి:
మామేవైష్యస్యసంశయమ్‌ ||

తాత్పర్యము : కావున ఓ అర్జునా! సర్వకాలముల యందును నీవు నన్నే తలచుచు నీ విద్యుక్తధర్మమైన యుద్ధము నొనరింపుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నాయందు నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహముగా పొందగలవు.

భాష్యము : శ్రీకృష్ణుడు అర్జునునికి ఇస్తున్న ఈ ఉపదేశము భౌతిక కార్యాలలో నిమగ్నమయి ఉన్న ప్రతి వ్యక్తికీ అత్యంత ముఖ్యమైనది. శ్రీ కృష్ణుడు అర్జునుని యుద్ధము విడనాడి, తనను స్మరించుమని చెప్పుట లేదు. అలాగే ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాలను నిర్వహిస్తూనే ‘హరే కృష్ణ’ ద్వారా కృష్ణున్ని స్మరించవచ్చును. ఈ విధముగా భౌతిక కల్మషాల నుండి మనస్సు, బుద్ధి ప్రక్షాళన చెంది కృష్ణునిపై లగ్నము చేయుట సాధ్యమవుతుంది. ఇలా కృష్ణుని నామాలను జపించుట చేత తప్పక కృష్ణలోకానికి చేరుకుందురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement