అధ్యాయం 8, శ్లోకం 5
5.
అంతకాలే చ మామేవ
స్మరన్ ముక్త్వా కలేవరమ్ |
య: ప్రయాతి స మద్భావం
యాతి నాస్త్యత్ర సంశయ: ||
తాత్పర్యము : అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసెడివాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు.
భాష్యము : ఈ శ్లోకము నందు కృష్ణచైతన్యము యొక్క ప్రాధాన్యత నొక్కి ఒక్కానించబడినది. ఎవరైతే కృష్ణున్ని స్మరిస్తూ శరీరాన్ని వదులుతారో వారు కృష్ణుని దివ్యత్వాన్ని తప్పక పొందుతారు. అయితే భగవంతుడు పరమ పవిత్రుడు. అందువలన ఈ శ్లోకములో ‘స్మరణము’ అనే పదము చాలా ముఖ్యమైనది. మనము కృష్ణున్ని స్మరించినట్లయితే అపవిత్రులుగానే ఉండిపోయి పరమపవిత్రున్ని చేరలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్నతనము నుండే, నిరంతరమూ ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే ‘ అను మహామంత్రమును జపించవలెను. దీనికి ఎన్ని అవాంతరాలు వచ్చినా ఓపికతో ముందుకు కొనసాగిన ట్లయితే చివరకు మరణ సమయములో పూర్తి ఫలితాన్ని పొందే అవకాశము ఉంటుంది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..