శ్రీ పరమాత్మనే నమ:
అథ అష్టమోధ్యాయ:
అక్షరపరబ్రహ్మయోగ:
అధ్యాయం 8, శ్లోకం 1
1.
అర్జున ఉవాచ
కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం
కిం కర్మ పురుషోత్తమ |
అధి భూతం చ కిం ప్రోక్తమ్
అధిదైవం కిముచ్యతే ||
తాత్పర్యము : అర్జునుడు ప్రశ్నించెను : ఓ దేవదేవా! పురుషోత్తమా! బ్రహ్మమననేమి? ఆత్మయననేమి? కామ్యకర్మలననేమి? భౌతికసృష్టియననేమి? దేవతలననెవరు? దయతో ఇది నాకు వివరింపుము.
భాష్యము : ఈ అధ్యాయములో శ్రీకృష్ణుడు అర్జునుని వేర్వేరు ప్రశ్నలైన ‘బ్రహ్మము’, ‘ఆత్మ’,’కర్మ’ మున్నగు వాటికి వివరణ ఇవ్వటం జరిగినది. శ్రీమద్భాగవతం ప్రకార ము పరమ సత్యమును బ్రహ్మము, పరమాత్మ మరియు భగవంతునిగా అర్ధము చేసుకొనవచ్చును. వైదిక నిఘంటువు ప్రకారము ‘ఆత్మ’ అనునది మనస్సు, ఆత్మ, శరీరము మరియు ఇంద్రియములను సూచిస్తుంది. అర్జునుడు. శ్రీకృష్ణుని ఇక్కడ ‘పురుషోత్తమా’అని సంభోదించెను. దాని భావమేమనగా పురుషోత్తముడు మాత్రమే, తన ప్రశ్నలకు సరైన సమాధానాలను ఇవ్వగల సమర్ధుడని, శ్రీ కృష్ణుని ఈ ప్రశ్నలడుగుచున్నాడే గాని, తన మిత్రుడని కాదు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..