అధ్యాయం 7, శ్లోకం 30
సాధిభూతాధిదైవం మాం
సాధియజ్ఞ ం చ యే విదు: |
ప్రయాణకాలే పి చ మాం
తే విదుర్యుక్తచేతస: ||
తాత్పర్యము : నా యందు సంలగ్నమైన చిత్తము కలిగినవారు దేవదేవుడనైన నన్నే భౌతిక జగత్తును, సర్వదేవతలను, సమస్త యజ్ఞములను
నియమించువానిగా తెలిసికొని మరణ సమయ మందును నన్ను దేవదేవుడు అను అవగాహనతో ఎరిగియుందురు.
తాత్పర్యము : కృష్ణ చైతన్యాన్ని పాటించే భక్తుడు కృష్ణున్ని అర్థము చేసుకొనుటలో ఎప్పుడూ పొరపాటు పడడు. ఈ మార్గము నుండీ వైదొలగ డు.
సరైన సాధు సాంగత్యములో అతడు దేవాదిదేవుడే ఈ భౌతిక జగత్తు, ఇందలి వస్తువులకు, దేవతలకు అధిపతి, నియామకుడూ అని గుర్తించ గలుగుతాడు. ఈ విధముగా భగవంతుణ్ణి యదార్ధముగా అర్థము చేసుకున్న అట్టి కృష్ణ చైతన్య వంతుడు మృత్యు సమయములో తప్పక కృష్ణున్ని స్మరిస్తాడు. ఈ విధముగా అతడు సహజముగానే భగవంతుని ధామమైన గోలోక బృందావనమును చేరుకుంటాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
జ్ఞానవిజ్ఞానయోగోనామ సప్తమోధ్యాయ: ||