Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 62
62.
తమేవ శరణం గచ్ఛ
సర్వభావేన భారత |
తత్ప్రసాదాత్‌ పరాం శాంతిం
స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్‌ ||

తాత్పర్యము : ఓ భరతవంశీయుడా ! అతనికే సంపూర్ణముగా శరణము నొందుము. అతని కరుణచే పరమశాంతిని, దివ్య శాశ్వతస్థానమును నీవు పొందగలవు.

భాష్యము : ప్రతి వ్యక్తి తన హృదయములో ఉండు భగవంతున్ని శరణు పొందవలెను. అట్లు శరణు పొందుట వలన అన్ని దు:ఖాల నుండి విముక్తి పొంది చివరకు భగవద్ధామాన్ని చేరుకొందురు. మనము చూసే ఈ భౌతిక జగత్తే కాక సర్వమూ భగవంతుని సృష్టే అయినా, ఆయన ధామమైన వైకుంఠము పరమ పదమని ఋగ్‌ వేద వాక్కు అయిన ‘తర్‌ విష్ణో పరమం పదం ‘ ద్వారా మనకు అర్థమగుచున్నది. ఇక పదిహేనవ అధ్యాయములో ‘సర్వస్య చాహం హృది సన్నివిష్ట: ‘ అనగా ‘ నేను ప్రతి వ్యక్తి హృదయములోనూ ఉంటాము’ అని కృష్ణుడు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ హృదయములోని పరమాత్మ అనగా శ్రీకృష్ణుడేనని మనము అర్థము చేసుకొనవలెను. ఇదే విషయాన్ని అర్జునుడు పదవ అధ్యాయములో ‘ పరం బ్రహ్మ పరం ధామ’ అని ప్రామాణిక ముగా నిరూపించి ఉన్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement