Wednesday, November 27, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 7, శ్లోకం 27

ఇచ్ఛాద్వేషసముత్థేన
ద్వంద్వమోహేన భారత |
సర్వభూతాని సమ్మోహం
సర్గే యాంతి పరంతప ||

తాత్పర్యము : ఓ భరతవంశీయుడా! పరంతపా! కోరిక మరియు ద్వేషముల వలన కలిగిన ద్వంద్వములచే మోహితులైన జీవులందరును మోహమునందే జన్మించుచున్నారు.

భాష్యము : జీవుడు సహజ సిద్ధముగా భగవంతుని అనుచరుడు. అది మరచిన జీవులు మాయలోపడి ఇచ్చా ద్వేషమునకు లోనవుదురు. నేను భగవంతునిలో సమానమవ్వాలనే కోరికను, భగవతుడైన శ్రీకృష్ణుడికి ఒక వ్యక్తిత్వము లేదు. అనే ద్వేషమును కలిగి ఉందురు. ఇటువంటి భావనల వలన వారు గౌరవము, అగౌరవము, మంచి, చెడు, సుఖము, దు:ఖము, స్త్రీపురుషుడు అనే ద్వంద్వాలతో సతమతమౌతూ ఉందురు. అటువంటి దురదృష్టవంతులు భగవంతుణ్ణి అర్థము చేసుకొనలేరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement