Saturday, November 23, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 7, శ్లోకం 25

నాహం ప్రకాశ: సర్వస్య
యోగమాయాసమావృత: |
మూఢోయం నాభిజానాతి
లోకో మామజమవ్యయమ్‌ ||
తాత్పర్యము : మూఢులకు మరియు అజ్ఞానులకు నేనెన్నడును వ్యక్తము కాను. వారికి నేను నా అంతరంగశక్తిచే కప్పబడియుందును. తత్కారనహుగా వారు నేను అజుడ ననియు, నాశనము లేని వాడననియు ఎరుగరు.

భాష్యము : చాలా మంది భగవంతుడే గనుక ఉంటే మనకెందుకు కనిపించడు? అని ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు పాండవులు, భీష్ముడు వంటి కొద్దిమంది భక్తులు మాత్రమే ఆయనను గుర్తించగలిగారు. భగవంతుడు భక్తులు కాని, అబుద్ధులకు తన యోగ మాయా శక్తిచే ఆవరించబడి వారికి అర్ధము కాకుండా ఉండిపోతాడు. శ్రీమద్భాగవతము, శ్రీ ఈశోపనిషత్తు ఈ విషయాన్నే ధృవీకరించుచున్నవి. ‘యోగమాయా ‘ ఆచ్చాదనమైన బ్రహ్మజ్యోతిని తొలగించినట్లయితే నిన్ను మేము చూడగలుగుతాము అని ప్రార్థించడం జరిగినది. అలాగే బ్రహ్మదేవుడు ”శాస్త్రజ్ఞులు అనువులను ఎంచుటలో లేదా గ్రహాలను లోకాలను లెక్కించుటలో సమర్థులు కావచ్చునేమో గానీ అనంతంగా విస్తరిస్తూ పోయే నీ
మహిమలను ఎప్పటికి తెలుసుకోజాలరు” అని కీర్తించి యున్నాడు. భగవంతుడు అజుడే కాక, ఆయన శక్తులు అవ్యయము. అనగా ఎప్పటికీ తరగనివి. కాబట్టి ఆయన సచ్చిదానంద స్వరూపుడు, అంతేకాక తరగని శక్తులను కూడి ఉంటాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement