Monday, November 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 39
39.
యదగ్రే చానుబంధే చ
సుఖం మోహనమాత్మన: |
నిద్రాలస్యప్రమాదోత్థం
తత్తామసముదాహృతమ్‌ ||

తాత్పర్యము : ఆత్మానుభవదృష్టి లేనిదియు, ఆది నుండి అంత్యము వరకు మోహ కారణమైనదియు, నిద్ర, సోమరితనము, భ్రాంతుల నుండి ఉద్భవించి నదియు అయిన సుఖము తమోగుణ ప్రధానమైనదని చెప్పబడును.

భాష్యము : సోమరితనము మరియు నిద్ర యందు ఆనందమును పొందువాడు తప్పక అజ్ఞానమందును, తమోగుణము నందును స్థితుడై నట్టివాడే. అట్లే ఎట్లు వర్తింపవలెనో ఎట్లు వర్తింపరాదో ఎరుగనివాడు కూడా తమోగుణముతో కూడుకొననట్టివాడే. తమో గుణము నందున్న వానికి ప్రతిదియు మోహముతో కూడుకున్నట్టిదే. ఆదియందు కాని, అంత్యము నందు కాని అతనికి సుఖము లభించదు. రజోగుణ స్వభావునకు ఆది లో ఒక రకమైన సుఖము అంత్యమున దు:ఖము లభించినను, తమోగుణము నందు ఉండువానికి మాత్రము ఆది మరియు అంతములు రెండింటి యందును దు:ఖమే కలుగును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement