Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 34
34.
యయా తు ధర్మకామార్థాన్‌
ధృత్యా ధారయతేర్జున |
ప్సంగేన ఫలాకాంక్షీ
ధృతి: సా పార్థ రాజసీ ||

తాత్పర్యము : ఓ అర్జునా! కాని ఏ నిశ్చముచే మనుజుడు ధర్మము, అర్థము, కామములందలి ఫలముల యెడ ఆసక్తిని వహించునో అట్టి నిశ్చయము రజోగుణప్రధానమైనది.

భాష్యము : ఇంద్రియతృప్తియే ఏకైక వాంఛగా కలిగి, మతధర్మ కార్యములు మరియు అర్థకార్యముల ఫలములను ఆశించుచు మానవుడు తన మనస్సును, ప్రాణమును, ఇంద్రియములను ఆ విధంగా నియుక్తములుగా చేయు మానవుడు రజోగుణముతో కూడినట్టివాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement