Sunday, November 10, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 14
14.
అధిష్ఠానాం తథా కర్తా
కరణం చ పృథగ్విధమ్‌ |
వివిధాశ్చ పృథక్‌ చేష్టా
దైవం చైవాత్ర పంచమమ్‌ ||

తాత్పర్యము : కార్యస్థానము(దేహము), కర్త, వివిధేంద్రియములు, వివిధములైన యత్నములు, చివరగా పరమాత్ముడు అనెడి ఈ ఐదును కార్యమునకు కారణములై యున్నవి.

భాష్యము : శరీరములో నుండు ఆత్మ ఇక్కడ ”అధిష్టానం” అని సంభోధించబడినది. ఆ ఆత్మ ఫలితములను ఆశించి కర్మలు చేయును కనుక దానిని ”కర్త” అని అందురు. దీనిని ప్రశ్న ఉపనిషత్తు మరియు వేదాంత సూత్రములు కూడా సమర్థించుచున్నాయి. కార్యములు చేయుటకు పరికరములుగా ఉపయోగపడేవి ఇంద్రియలము. అలా ఇంద్రియములను ఉపయోగించుకుని ఆత్మ అనేక కార్యములు చేయుచుండును. ప్రతి కార్యమునకు ఒక ప్రత్యేక ప్రయత్నము ఉండును. అయితే అటువంటి కార్యములన్నీ హృదయమున స్నేహితుని వలే ఉండు పరమాత్మ యొక్క ఇష్టముపై ఆధారపడి ఉండును. ఈ పరిస్థితులను బట్టి పరమాత్మ కోరికపై కృష్ణచైతన్యములో చేయు కార్యములకు కర్మ ఉండదు. ఎవరైతే సంపూర్ణ కృష్ణచైతన్యములో ఉందురో వారు తమ కార్యములకు బాధ్యులు కారు. దేవవాది దేవుడు, పరమాత్మల ఇష్టము పైననే అన్నీ ఆధారపడి ఉంటాయని మనము అర్ధము చేసుకొనవలెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement