Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 13
13.
పంచైతాని మహాబాహో
కారణాని నిబోధ మే |
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని
సిద్ధయే సర్వకర్మణామ్‌ ||

తాత్పర్యము : ఓ మహాబాహుడవైన అర్జునా! వేదాంతము ననుసరించి కర ్మలు సిద్ధించుటకు ఐదు కారణములు గలవు. వాని నిపుడు నా నుండి ఆలకింపుము.

భాష్యము : ప్రతీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అలాంటప్పుడు కృష్ణచైతన్యముతో పనిచేయు వ్యక్తి తన కార్యాల వలన వచ్చు సుఖ: దు:ఖాలకు బాధ్యుడు కాడు. ఇది ఏ విధముగా సాధ్యమగునవి ఎవరైనా ప్రశ్నించవచ్చును. దీనికి సమాధానము కావలెనన్న మనము శాస్త్ర ఆధారములను పరిశీలించవలెను. ఇక్కడ స్వయముగా భగవంతుడు కూడా వేదాంత ప్రమాణాన్ని ఆదారముగా తీసుకొనుచున్నాడు. వేదాంత మనగా వేదాల అంతిమ తీర్మానమని శంకరాచార్యులతో సహా అందరు ఆచార్యులు స్వీకరించి ఉంటిరి.

ప్రతి హృదయములో నుండు పరమాత్మకే పూర్తి అధికారము ఇవ్వబడినది. ఆ పరమాత్మ పూర్వ కర్మానుసారము పని చేయమని వ్యక్తిని ప్రోత్సాహిస్తాడు. పరమాత్మ ఇచ్చు స్ఫూర్తితో చేయు కృష్ణ చైతన్య కార్యాలు ఈ జన్మలో గాని వచ్చే జన్మలో కాని ప్రతిచర్యలను సృష్టించవు. రాబోవు శ్లోకములో ఈ విషయము మరింత స్పష్టపరుచబడినది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement