భక్తిప్రభ గీతాసారం(ఆడియోతో….) By Nalini P November 6, 2022 అధ్యాయం 7. శ్లోకం 20కామైస్తై సైర్హృతజ్ఞానా:ప్రపద్తే న్యదేవతా: |తం తం నియమమాస్థాయప్రకృత్యా నియతా: స్వయా ||తాత్పర్యము : విషయకోరికలచే జ్ఞానము అపహరింపబడినవాడ, ఇతర దేవతలకు శరణమునొంది తమ గుణములను బట్టి ఆయా పూజావిధానములను అనుసరింతురు.భాష్యము : భౌతిక భావనల నుండి పూర్తిగా ప్రక్షాళన చెందిన వారు భగవంతునికి శరణు పొంది ఆయన సేవను చేయుదురు. అలా భౌతిక ప్రక్షాళన పూర్తి కాకపోతే వారు ఇంకా భక్తులు కానట్లే లెక్క. అయితే వారు భగవంతుణ్ణి ఆశ్రయించటమనే, సరైన లక్ష్యాన్ని ఎంచుకున్నారు కాబట్టి త్వరలోనే కామము నుండి దూరమవుతారు. కాని ఎవరైతే రజోగుణము, తమో గుణములలో నుందురో వారు సత్వరమే కోరికలను తీర్చుకొనుటకు తెలివితక్కువ తనముతోదేవతలను పూజిస్తూ సంతృప్తి చెందుదురు. వారు జీవిత లక్ష్యాన్ని సాధించుట ఎట్లో తెలియక కొద్దిపాటి కోరికలను తీర్చుకొనుటకు తప్పుదోవ పట్టుదురు. వారు తమ కష్టాలనను తీర్చుటకు దేవాదిదేవుని కంటే దేవతలను ఆశ్రయించటమే మేలు అని భావించుదురు. అయితే శుద్ధ భక్తుడు, దేవాది దేవుడు ఒక్కడే అందరికి ప్రభువనీ, మిగిలిన వారందరు ఆయన దాసులని, అతడు భగవంతుని మీదే ఆధారపడి, ఆయ ఇచ్చిన దానితో సంతృప్తి చెందుతాడు.….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ….. TagsBhakti prabhaDevotionalgeethasaaram FacebookTwitterWhatsAppCopy URLTelegram Previous articleపంచాయుధ స్తోత్రము (ఆడియోతో..)Next articleశ్రీ సత్యనారాయణ స్వామి వారి ధ్యాన శ్లోకములు ( ఆడియోతో..) మరిన్ని వార్తలు శ్రీ షిరిడి సాయినాధుని మధ్యాహ్న హారతి Pravallika Battu - November 22, 2024 ఔదార్యము గూర్చి శ్రీమాన్ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ Pravallika Battu - November 22, 2024 ధర్మం – మర్మం : కార్తిక మాస వ్రత ఫలం (ఆడియోతో…) Pravallika Battu - November 22, 2024 శ్రీ సత్యనారాయణ స్వామి వారి ధ్యాన శ్లోకములు ( ఆడియోతో..) Pravallika Battu - November 22, 2024 గీతాసారం(ఆడియోతో…) Pravallika Battu - November 22, 2024 సౌందర్యలహరి Pravallika Battu - November 22, 2024 Advertisement తాజా వార్తలు AP – వైసిపికి మరో షాక్… ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ రాం రాం Congrats – అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ Wayanad : ప్రియాంకా గాంధీ భారీ మెజార్టీతో ఘన విజయం AP | మహాయుతి కూటమికి విషెస్ తెలిపిన చంద్రబాబు TG | తెలంగాణలో ప్రజా తిరుగుబాటు ఖాయం.. బండి సంజయ్ Suicide – మియాపూర్ శ్రీచైతన్యలో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం AP – ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయం – పవన్ కల్యాణ్ TG | వికారాబాద్ జిల్లాలో దారుణహత్య Inquiry – అదానీకి సెబీ షాక్ .. లంచాలు ఇచ్చిన అభియోగాలపై విచారణ చేపట... Advertisement