Monday, November 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 17, శ్లోకం 28
28.
అశ్రద్దయా హుతం దత్తం
తపస్తప్తం కృతం చ యాత్‌ |
అసదిత్యుచ్యతే పార్థ
న చ తత్ప్రేత్య నో ఇహ ||

తాత్పర్యము : ఓ పార్థా! పరమపురుషుని యందు శ్రద్ధ లేకుండా ఒనర్చునటువంటి యజ్ఞ ము, దానము లేదా తపస్సు అనునది అశాశ్వతమైన ది. ‘అసత్‌’ అని పిలువబడు అట్టి కర్మ ప్రస్తుత జన్మము నందును, రాబోవు జన్మము నందును నిరుపయోగమే.

భాష్యము : దివ్యమైన లక్ష్యము లేకుండా చేసే యజ్ఞము, దానము, తపస్సు నిరర్ధకము. అటువంటి కార్యములు ఈ శ్లోకము నందు నిరసించబడ్డాయి. కాబట్టి ప్రతి కార్యము భగవంతుణ్ని ఉద్దేశించి చేయవలసి ఉన్నది. లేనట్లయితే అవి నిష్ఫలములే కాగలవు. వేద శాస్త్రాలు భగవంతునిపై ఇటువంటి విశ్వాసాన్నే పెంచుతాయి. వాటి లక్ష్యము కృష్ణున్ని అర్థము చేసుకొనుటయే!

సత్వ రజో తమో గుణములలో ఈ కార్యములను చేయవచ్చును. క్రమేణ సత్వ గుణమునకు ఉద్దరింపబడి పురోగతి సాధించవచ్చును. వీటన్నింటి కంటే ఒక శుద్ధ భక్తుని సాంగత్యములో విశ్వాసాన్ని వృద్ధి చేసుకుని శ్రీ కృష్ణుని ప్రీత్యర్థము కార్యములను చేసినట్లయితే త్వరితగతిన పురోగతి సాధించవచ్చును. ఇదే ఈ పదిహేడవ అధ్యాయము యొక్క సారాంశము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

- Advertisement -

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
శ్రద్ధాత్రయవిభాగయోగోనామ సప్తదశోధ్యాయ: ||

Advertisement

తాజా వార్తలు

Advertisement