అధ్యాయం 17, శ్లోకం 24
24.
తస్మాదోమిత్యుదాహృత్య
యజ్ఞదానతప:క్రియా: |
ప్రవర్తంతే విధానోక్తా:
సతతం బ్రహ్మవాదినామ్ ||
తాత్పర్యము : కనుకనే శాస్త్రనియమానుసారము యజ్ఞము, దానము, తపములను చేపట్టు తత్త్వజ్ఞులు పరమపురుషుని పొందుటకై వానిని ఓంకారముతో ప్రారంభించుదురు.
భాష్యము : విష్ణువు యొక్క పాదపద్మాలే పరమపదములని ఋగ్ వేద వాక్కు అయిన ”ఓం తద్ విష్ణో: పరమో పదం” సూచించుచున్నది. కాబట్టి ప్రతి కార్యము దేవాదిదేవుడైన భగవంతుణ్ని ఉద్దేశించి చేసినట్లయితే అది పరిపూర్ణము కాగలదు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..